ఆన్‌లైన్ గ్రీవెన్స్ | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ గ్రీవెన్స్

Published Mon, Nov 21 2016 12:11 AM

ఆన్‌లైన్ గ్రీవెన్స్

ఇంటి నుంచే ఫిర్యాదు చేసే వెసులుబాటు
కార్యాలయాలకు వెళ్లే భారానికి చెక్
ఇప్పటికే 55 ప్రభుత్వ శాఖలకు ఐడీలు
{పతీ ఫిర్యాదుకు నంబర్  ఏ స్థారుులో ఉందో తెలుసుకునే అవకాశం

వరంగల్ రూరల్ :  ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్ సెల్(ప్రజావాణి)లో ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయడమంటే పెద్ద ప్రహసనమేనని చెప్పాలి. అరుుతే, ప్రజలకు పాలనను దగ్గర చేయాలన్న భావనతో రాష్ట్రప్రభుత్వం తాజాగా జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఈ మేరకు ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ జీవన్ పాటిల్ గ్రీవెన్‌‌ససెల్‌ను తీరును నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్‌‌సకు రావడం ఇబ్బందే అరుునా తప్పని పరిస్థితుల్లో ప్రజలు వస్తున్నారని గుర్తిం చారు. వారికి వ్యయప్రయాసాలు తగ్గించాలన్న భావనతో డివిజన్, మండల కేంద్రాల్లో ప్రజావాణిని రెండు వారాల క్రితం ప్రారంభించారు. అరుుతే, ఆ వారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్‌‌సకు ఏ మాత్రం రద్దీ తగ్గలేదు. కొంచెం ప్రచారమైతే జిల్లా కేంద్రానికి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందనే భావనకు వచ్చారు.

మొత్తం తగ్గించేందుకు..
కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్‌‌ససెల్‌కు వరంగల్ రూరల్ జిల్లా ఏర్పడ్డాక మొదటివారం 75, రెండో వారం 170, మూడో వారం 75, నాలుగో  వారం 120 ఫిర్యాదులు అందారుు. ఇలా కలెక్టరేట్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గించేందుకు మం డల స్థారుులో రెండు వారాలుగా గ్రీవెన్‌‌స నిర్వహిస్తున్నారు.అరుుతే, జిల్లా, మండల కా ర్యాలయాలకు వచ్చే వారి సంఖ్య తగ్గించేందు కు తాజాగా ‘ఆన్‌లైన్ గ్రీవెన్‌‌ససెల్’కు శ్రీకారం చుట్టారు. దీంతో ఇంటర్‌నెట్ కనెక్షన్ కలిగిన కంప్యూటర్ లేదా స్మార్ ఫోన్ ఉంటే చాలు ఇం ట్లో కూర్చునే శాఖల వారీగా మనం ఫిర్యాదు చేయొచ్చు. ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ వరంగల్ రూరల్ జిల్లాలో మాత్రం 55 శాఖలకు ప్రత్యేక ఐడీలు కేటారుుంచారు. ఈ మేరకు ప్రజలు ఛిఞజట్చఝట.్టట.జీఛి.జీ సైట్‌లోకి వెళ్లి మన జిల్లా, ఫిర్యాదుకు సంబంధించి శాఖ తదితర వివరాలతో పాటు ఫిర్యాదు చేసే వివరాలు నింపి సబ్‌మిట్ చేస్తే ఆ ఫిర్యాదుకు ఓ ప్రత్యేక నంబర్ వస్తుంది. ఆ నంబర్ ద్వారా ఫిర్యాదు ఏ స్థారుులో ఉందో తెలుసుకోవచ్చు.

అలాగే, శాఖల వారీగా ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యా రుు. ఎన్నింటిని పరిష్కరించారు, పరిష్కరించకపోతే కారణాలేమిటన్నవివరాలనుకలెక్టర్‌తో పా టు శాఖల ఉన్నతాధికారులు తెలుసుకునే వెసలుబాటు ఉంది. తద్వారా ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెరిగి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారనేది కలెక్టర్ భావన. ఈ మేరకు ఆన్‌లైన్‌లో గ్రీవెన్‌‌స పద్ధతిపై జిల్లాలో విసృ్తతంగా ప్రచారం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

త్వరలోనే ఎస్‌ఎంఎస్ అలర్ట్
ప్రజావాణిలో నేరుగా లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వారికి ఎస్‌ఎంఎస్ అందుతుంది. అలాగే, ఆ ఫిర్యాదు పరిష్కారమయ్యాక మరో మెసేజ్, పరిష్కరించలేకపోతే అందుకు కారణాలు చెబుతూ మెసేజ్‌లు అందుతారుు. అరుుతే, ఒక్కో మెసేజ్‌కు ఐదు పైసల ఖర్చవుతుండగా.. దీనిని భరించేందుకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అంగీకరించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎంఎస్ చార్జీలు ఎవరు చెల్లించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో  ఫిర్యాదుదారుల సెల్ నంబర్లకు మెసేజ్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఈ విధానం ప్రారంభమయ్యే అవకాశముంది.

Advertisement
Advertisement