ఓవరాల్‌ చాంపియన్‌ పశ్చిమ | Sakshi
Sakshi News home page

ఓవరాల్‌ చాంపియన్‌ పశ్చిమ

Published Mon, Feb 6 2017 12:26 AM

OVER CHAMPION WEST

విజయవాడ స్పోర్ట్స్‌ : ఏపీ ప్రొహిబిషన్‌  అండ్‌ ఎక్సైజ్‌ శాఖ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్‌ మీట్‌ విజయవంతంగా ముగిసింది. స్థానిక ఆంధ్ర లయోల కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించిన ఎక్సైజ్‌ శాఖ స్పోర్ట్స్‌ మీట్‌లో ఆల్‌ రౌండ్‌ ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ (మెన్‌  అండ్‌ ఉమెన్‌ )ను కృష్ణా జట్టు కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో గుంటూరు, మహిళల విభాగంలో పశ్చిమగోదావరి జట్లు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ను సాధించాయి. 
విజేతల వివరాలు
టేబుల్‌ టెన్నిస్‌లో పి.వలి (అనంతపురం), ఆర్‌వీ రమణ (విజయనగరం), జి.రాంబాబు (తూర్పు గోదావరి) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 400 మీటర్ల వెటరన్‌  (ఆఫీసర్స్‌)వాక్‌లో కె.సూర్యప్రకాష్‌ (చిత్తూరు), బి.మంగనాయుడు (హెడ్‌ ఆఫీసు), కె.రమేష్‌ (హెడ్‌ ఆఫీసు), సిబ్బంది విభాగంలో డి.బసవేశ్వరరావు (గుంటూరు), ఎస్‌కే మెహబూబ్‌బాషా (నెల్లూరు), టి.కిషోర్‌ (పశ్చిమ గోదావరి), 400 మీటర్ల మహిళా వాక్‌లో కృష్ణా, పశ్చిమగోదావరి, అనంతపురం, 400 మీటర్ల రిలే పురుషుల విభాగంలో చిత్తూరు, అనంతపురం, విశాఖపట్నం, లాంగ్‌ జంప్‌లో కె.మల్లేశ్వరి (కృష్ణా), ఆర్‌.బ్యూలా (పశ్చిమ గోదావరి), వి.ప్రభావతి (అనంతపురం) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వాలీబాల్‌లో శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పుగోదావరి, కబడ్డీలో కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, క్యారమ్స్‌లో జి.సందీప్‌ (గుంటూరు), జి.బాబూరావు (శ్రీకాకుళం), ఎం.బాపూజీనాయక్‌ (చిత్తూరు), మహిళల విభాగంలో ఆర్‌.సత్యవతి (పశ్చిమగోదావరి), వి.అమల (పశ్చిమగోదావరి), కె.శ్వేత రాణి (కర్నూలు), టెన్నికాయిట్‌ సింగిల్స్‌లో ఎస్‌.ధనలక్ష్మి (విశాఖపట్నం), ఎన్‌ .వెంకటరమణ (గుంటూరు), ఎస్‌.శర్వాణి, డబుల్స్‌లో ఎస్‌.ధనలక్ష్మి, జయసుధ (విశాఖపట్నం)జోడీ, ఎండీ నవీన, కె.భారతీ రాణి (పశ్చిమగోదావరి), పి.కుమారి, ఎస్‌.సరస్వతి (చిత్తూరు) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 
మహిళల విభాగంలో కృష్ణా జిల్లా విసన్నపేట ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌ కు చెందిన  మహిళా కానిస్టేబుల్‌ కె.మల్లేశ్వరి అథ్లెటిక్స్‌లో విశేష ప్రతిభ కనపరిచి జిల్లా జట్టు ఆల్‌ రౌండ్‌ ఛాంప్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించి పలువురి మన్ననలు అందుకున్నారు. స్వతహాగా ఆమె వాలీబాల్‌ క్రీడాకారిణి. స్పోర్ట్స్‌ మీట్‌ అనంతరం జరిగిన కార్యక్రమానికి ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ముకేష్‌కుమార్‌ మీనా అధ్యక్షత వహించారు. విజేతలకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో శాప్‌ మాజీ చైర్మన్‌  పీఆర్‌ మోహన్,ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ నాయుడు, డెప్యూటీ కమిషనర్లు సత్యప్రసాద్, వైబీ భాస్కర్‌రావు, జోసెఫ్, శ్రీమన్నారాయణ, నాగలక్ష్మి, సూపరింటెండెంట్లు మురళీధర్, మనోహర్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement
Advertisement