15 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు | Sakshi
Sakshi News home page

15 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

Published Tue, Sep 27 2016 12:11 AM

paddy sales centres from 15th

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభించనున్నట్టు జేసీ ఎం.రాంకిషన్‌ తెలిపారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సివిల్‌ సప్లయి, మార్కెటింగ్‌ అధికాలను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో వారితో ఆయన సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌ మిల్లులకు ధాన్యం చేరవేసేందుకు టెండర్లు నిర్వహించని అధికారులపై మండిపడ్డారు.
 
గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన «ధాన్యంకు చెల్లింపులు, ఇతర వివరాలపై ఆరా తీశారు. హమాలీ చెల్లింపులకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లావ్యాప్తంగా 68 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.4లక్షల మెట్రిక్‌ టన్నులు వరి«ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ రాజారావు, సివిల్‌ సప్లయి డీఎం రవీందర్, మార్కెటింగ్‌ ఏడీ బాలమణి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement