‘పామాయిల్‌’ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ | Sakshi
Sakshi News home page

‘పామాయిల్‌’ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

Published Fri, Aug 5 2016 9:28 PM

ట్రయల్‌ రన్‌ను పరిశీలిస్తున్న మేనేజర్‌

అశ్వారావుపేట : మండల కేంద్రంలోని పామాయిల్‌ ఫ్యాక్టరీ ట్రయల్‌ రన్‌ విజయవంతం అయినట్లు ఫ్యాక్టరీ మేనేజర్‌ హరినాథ్‌బాబు తెలిపారు. శుక్రవారం ఫ్యాక్టరీ నిర్వహణను ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వేయర్‌ ద్వారా బకెట్‌లలో గెలలను నింపి.. స్టెరిలైజర్‌లో ఉడికించారు. ఇంతవరకు ప్రక్రియ సక్రమంగానే జరిగిందని.. మరో మూడు రోజుల్లో ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావచ్చని మేనేజర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement