అక్రమ సంపాదనే చంద్రబాబు ధ్యేయం | Sakshi
Sakshi News home page

అక్రమ సంపాదనే చంద్రబాబు ధ్యేయం

Published Mon, Feb 20 2017 10:16 PM

అక్రమ సంపాదనే చంద్రబాబు ధ్యేయం - Sakshi

పాలన, ప్రజలను గాలికొదిలి   అమరావతి జపం
వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి     గుణపాఠం చెప్పాలి
గడపగడపకూ వైఎస్సార్‌లో పెద్దిరెడ్డి ఆగ్రహం


చౌడేపల్లె(పుంగనూరు): అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనే ధ్యేయంగా చంద్రబాబు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్‌ పెద్దిరెడ్డిలతో కలిసి చౌడేపల్లెలో గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఒరిగిందేమీ లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతిపై ఉన్న శ్రద్ధ పాలనపైనా, ప్రజలపైనా లేదన్నారు.

అక్రమ సంపాదనతో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తన పార్టీలోకి ఎలా కొనుగోలు చేయాలన్న ధ్యాస తప్ప వేరే ఆలోచన లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో లాలూచిపడిన సంగతి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. హామీలు అమలు చేయకుండా ఆర్థిక లోటు ఉందని చెబుతూ అమరావతి పేరుతో విదేశీ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు ముక్తకంఠంతో హోదా కోసం నినదిస్తే, ఆయన మాత్రం  ప్యాకేజీ కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎçప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. రానున్న రోజుల్లో వైఎస్‌ జగన్‌ సారథ్యంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు అందరూ సుఖ సంతోషాలతో గడుపుదామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement