జననేతకు జనాశీస్సులు | Sakshi
Sakshi News home page

జననేతకు జనాశీస్సులు

Published Wed, Dec 21 2016 11:49 PM

జననేతకు జనాశీస్సులు - Sakshi

- ఘనంగా వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు
- వెల్లి విరిసిన సేవా పరిమళం 
- పలుచోట్ల రక్తదాన శిబిరాలు
- వృద్ధులకు దుప్పట్ల పంపిణీ
- అనాథలకు అన్నదానం
 
కర్నూలు(అర్బన్‌): ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా బుధవారం జిల్లాలో సేవా కార్యక్రమాలు వెల్లివిరిశాయి. పుట్టిన రోజు వేడుకల్లో ప్రజలు స్వచ్ఛందంగా పొల్గొన్ని జననేతకు ఆశీస్సులు అందజేశారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్టీ కార్యాలయాల్లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అనాథ, వృద్ధాశ్రమాల్లో దుప్పట్లు, చీరలను పంపిణీ చేశారు. అలాగే దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు. 
కర్నూలులో ...
జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్‌ తదితరులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. రాయల్‌ ఫంక‌్షన్‌ హాల్‌లో రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. అంధుల కార్యాలయానికి రెండు నెలల అద్దెకు సంబంధించి రూ.5 వేలను అందించారు. ఈ నేపథ్యంలోనే పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నగరంలోని బుధవారపేటలో జగన్‌ అభిమానులు భారీ కేక్‌ను తప్పెట్లతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి కట్‌ చేసి స్థానికులకు అందజేశారు. బుధవారపేటకు చెందిన చంద్రశేఖర్, శాంతికృష్ణ, రామకృష్ణ, శేషాద్రి, రవికుమార్, ఏసేబు పాల్గొన్నారు.
ఆదోనిలో ...
పార్టీ కార్యాలయంలో జననేత జన్మదిన సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే వై సాయిప్రసాదరెడ్డి పాల్గొన్నారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. అలాగే కౌన్సిలర్లు వెంకటలక్ష్మి, గౌరమ్మ ఆమె తనయుడు చలపతి.. అనాథ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. 
కోడుమూరులో ...
మాజీ ఎమ్మెల్యే పి. మురళీకృష్ణ ఆధ్వర్యంలో సి. బెళగల్‌లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పేదల కష్టాలు తీరుతాయన్నారు.
పత్తికొండలో ...
పత్తికొండలోని చక్రరాళ్ల రోడ్డులోని గురుకుల పాఠశాలలోని 300 మంది విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, జిల్లా నాయకులు పోచంరెడ్డి మురళీధర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జూటూరు బజారప్ప పాల్గొన్నారు. మండల కేంద్రమైన మద్దికెరలో నాయకులు మురళీధర్‌రెడ్డి, రాజశేఖరరావు తదితరులు కేక్‌ కట్‌ చేసి జగన్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 
పాణ్యంలో ...
పాణ్యం నియోజకవర్గ పరిధిలోని సీ క్యాంప్‌ శిశు విహార్‌లో చిన్నారులకు ఆటవస్తువులు, ఫ్యూరీఫై వాటర్‌ క్యాన్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, సాంబశివారెడ్డి, కటారి సురేష్, అనీల్, అశోక్‌ పాల్గొన్నారు. 
నందికొట్కూరులో ... 
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య నివాసంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు  ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాతకోట, నెహ్రూనగర్‌ గ్రామాలకు చెందిన 44 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.  
ఎమ్మిగనూరులో ...
ఎమ్మిగనూరులో వైఎస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా స్థానిక సాక్షి దినపత్రిక కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, పార్టీ కన్వీనర్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. అలాగే వైఎస్‌ఆర్‌ సర్కిల్‌లోని వైఎస్‌ విగ్రహానికి వైఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సినీ హీరో కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. 
డోన్‌లో ...
డోన్‌లోని ఎమ్మెల్యే బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి నివాసంలో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, నాయకులు మల్లెంపల్లి రామచంద్రుడు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. అలాగే పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో స్థానిక ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. 
ఆలూరులో ...
ఆలూరులో ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాసులు, యువజన విభాగం అధ్యక్షుడు విక్రాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం పట్ణణంలోని వాసవీ కన్నకాపరమేశ్వరీ కళ్యాణ మండపంలో 300 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి, దేవనకొండ మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షుడు చిన్న ఈరన్న, భీమప్ప, ఓబులేసు, లుబాంబ, హాలహర్వి ఎంపీపీ బసప్ప తదితరులు పాల్గొన్నారు. 
బనగానపల్లెలో ...
బనగానపల్లెలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో.. రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. పలుకూరు గ్రామంలో పార్టీ నాయకుడు గుండం నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. 
ఆత్మకూరులో ...
ఆత్మకూరులోని గౌడ్‌ సెంటర్‌లో నియోజకవర్గ ఇంచార్జీ బుడ్డా శేషారెడ్డి ఆదేశాల మేరకు నాయకులు గోకారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 
ఆళ్లగడ్డలో ...
 పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జీ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. నాయకులు ఇమామ్‌ఉసేన్, «థామస్‌ తదితరులు పాల్గొన్నారు. 
నంద్యాలలో ...
పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జీ రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. వైఎస్‌ యువసేన రాష్ట్ర కార్యదర్శి వైఎస్‌ సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో అంధుల పాఠశాల, సంఘమిత్ర నిరాశ్రయ ఆవాసంలో కేక్‌ కట్‌ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అలాగే ఆయా పాఠశాలల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. 

Advertisement
Advertisement