కుటుంబ కలహాలతో ఫొటోగ్రాఫర్‌ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో ఫొటోగ్రాఫర్‌ ఆత్మహత్య

Published Mon, Mar 6 2017 12:30 AM

photographer suicide

అనంతపురం సెంట్రల్‌: నగరంలోని కమలానగర్‌లో నివాసం ఉంటున్న వెంకటరమణ (40) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటరమణ ఫొటో స్టూడియో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలంగా భార్యతో మనస్పర్థలు ఉన్నాయి. భార్య ఇటీవల ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపంతో వెంకటరమణ ఆదివారం స్టూడియోలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి, అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ రంగడు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement