తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Fri, Nov 4 2016 9:26 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

నిన్న(గురువారం) స్వామివారిని 72,408మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.84కోట్లువచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement