ఏఎంసీల పరిధిలో భారీగా మొక్కల పెంపకం | Sakshi
Sakshi News home page

ఏఎంసీల పరిధిలో భారీగా మొక్కల పెంపకం

Published Mon, Aug 1 2016 10:59 PM

ఏఎంసీల పరిధిలో భారీగా మొక్కల పెంపకం - Sakshi

5 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం
మార్కెటింగ్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు
రావులపాలెం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల పరిధిలో వనం–మనం పథకం ద్వారా ఐదు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్టు మార్కెటింగ్‌ శాఖ విశాఖపట్నం రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె. శ్రీనివాసరావు తెలిపారు.  వనం–మనంలో భాగంగా రావులపాలెం అరటి మార్కెట్‌ యార్డులో ఏఎంసీ చైర్మన్‌ బండారు వెంకట సత్తిబాబు ఆధ్వర్యంలో సోమవారం వన మహోత్సవం జరిగింది.  యార్డు ప్రాంగణంలో జేడీ శ్రీనివాసరావు, చైర్మన్‌ సత్తిబాబులు పలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి ఎస్‌. సత్యనారాయణ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏవీ శ్రీధర్, సూపర్‌వైజర్లు పి.సుబ్బరాజు, ప్రసాద్, ఏఎంసీ  చైర్మన్‌ గుతు ్తల ఏడుకొండలు పాల్గొన్నారు. స్థానిక డాన్‌బాస్కో స్కూల్లో కరస్పాండెంట్‌ బాలరాజు ప్రిన్సిపాల్‌ బల్తాజార్‌ ఆధ్వర్యంలో 550 మొక్కలను విద్యార్థులకు పంపిణీ చేశారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement