ఉపాధి నిధులతో ఆటస్థలాలు, శ్మశాన వాటికలు | Sakshi
Sakshi News home page

ఉపాధి నిధులతో ఆటస్థలాలు, శ్మశాన వాటికలు

Published Sat, Oct 29 2016 11:15 PM

play grounds, graveyards with upadhi funds

– డ్వామా పీడీ సీహెచ్‌ పుల్లారెడ్డి
 
కర్నూలు(అర్బన్‌): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేసుకునేందుకు, శ్మశాన వాటికలను అభివృద్ధి పరచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డ్వామా పీడీ సీహెచ్‌ పుల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణాభివృద్ధి వాఖ కమిషనర్‌ నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు తమ గ్రామాల్లో శ్మశాన స్థలాలు, ఆట స్థలాలు లేక మైదానాలను గుర్తించి సంబంధిత వివరాలను ఎంపీడీఓకు తెలియజేయాలన్నారు. ఉపాధి హామీ సిబ్బంది ఆయా గ్రామాల్లోని ఆట మైదానాలు, శ్మశాన స్థలాలు, గ్రామ పంచాయతీ భవనాలను గుర్తించి జియో ట్యాగింగ్‌ చేసి వాటి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement