పోచారానికి పర్యాటక కళ | Sakshi
Sakshi News home page

పోచారానికి పర్యాటక కళ

Published Mon, Sep 26 2016 7:34 PM

పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు - Sakshi

పొంగిపొర్లుతున్న ప్రాజెక్టు
డ్యాం పరిసర ప్రాంతాల్లో వెలసిన దుకాణాలు

మెదక్‌ రూరల్‌: గడిచిన రెండు సంవత్సరాల్లో తీవ్ర అనావృష్టితో చెరువులు, కుంటలతో పాటు -ప్రాజెక్టులు సైతం పూర్తిగా వట్టిపోయాయి.  మెదక్‌-నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దులోని పోచారం -ప్రాజెక్టు పర్యాటకులకు ప్రతియేటా కనువిందు చేస్తోంది.  ప్రాజెక్టును ఆనుకుని పోచారం అభయారణ్యం ఉంది. ఇందులో జింకలతో పాటు అనేక రకాల జంతువులున్నాయి. అలాగే ప్రపంచప్రసిద్ధిగాంచిన చర్చి, ఏడుపాయల దుర్గాభవాని, కాకతీయుల కాలంనాటి ఖిల్లా ఈ ప్రాంతంలో ఉండటంతో  వీటిని తిలకించేందుకు పర్యాటకులు  రాష్ట్రనలుమూలల నుంచి భారీ సంఖ్యలో వస్తుంటారు.

ముఖ్యంగా పోచారం అభయారణ్యం  హైదరాబాద్‌ నగరానికి కేవలం 100 కిలో మీటర్ల దూరంలో ఉండటంతో వారాంతపు సెలవుదినాల్లో  పర్యాటకులు    కుటుంబాలతో  వస్తుంటారు. కాగా   రెండు సంవత్సరాలుగా వర్షాలు లేక పోవటంతో ప్రాజెక్టు పూర్తిగా  వట్టిపోయింది. దీంతో పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది.   వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. దీంతో పర్యాటకుల తాకిడి మళ్లీ మొదలైంది.    హైదరాబాద్, రంగారెడ్డి, నిజమాబాద్, కరీంనగర్, తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు.  సందర్శకులను దృష్టిలో పెట్టుకుని చిరువ్యాపారుల దుకాణాలు డ్యాం ప్రాంతంలో  వెలిశాయి.

Advertisement
Advertisement