పోడు భూములకు పట్టాలివ్వాలి

9 Aug, 2016 23:45 IST|Sakshi
మంచిర్యాల సిటీ : జిల్లాలో గిరిజనులు, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం వద్ద ఐఎఫ్‌టీయూ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో ఆయిషా మస్రత్‌ ఖానంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి టీ. శ్రీనివాస్‌ మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలివ్వకుండా, ఆక్రమించుకోవడం సరికాదన్నారు. సాగుచేసుకుంటున్న రైతులపై సంబంధిత శాఖ అధికారులు అక్రమ కేసులను పెట్టి వేధిస్తోందని ఆయన ఆరోపించారు. హరితహారం పేరిట సాగుభూముల్లో మొక్కలు నాటుతూ, వారి పంటలను ధ్వంసం చేస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో లాల్‌కుమార్, చాంద్‌పాషా, బ్రహ్మానందం, దేవరాజు, ఎం జ్యోతి, శ్రీకాంత్‌ ఉన్నారు.
 
మరిన్ని వార్తలు