శ్రీసాయి మృతి కేసులో ప్రధాన ముద్దాయిలు పోలీసులే | Sakshi
Sakshi News home page

శ్రీసాయి మృతి కేసులో ప్రధాన ముద్దాయిలు పోలీసులే

Published Thu, Jul 21 2016 7:53 PM

శ్రీసాయి మృతి కేసులో ప్రధాన ముద్దాయిలు పోలీసులే - Sakshi

 రేపల్లె: అడవులదీవి సంఘటనకు సంబంధించి వేముల శ్రీసాయి మృతి కేసులో పోలీసులే ప్రధాన నిందితులని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారం చేపట్టిన కొద్ది కాలానికే శాంతి, భద్రతలు క్షీణించాయని విమర్శించారు. జాస్మిన్‌ మృతి చెందిన సంఘటనలో శ్రీసాయి, పవన్‌కుమార్‌లను స్థానికులు పట్టుకున్న కొద్దిసేపటికే ఎసై, సిబ్బంది అక్కడి చేరుకున్నారని, ఆవేశంగా ఉన్న స్థానికులను అదుపుచేసి శ్రీసాయి, పవన్‌కుమార్‌లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి ఉంటే శ్రీసాయి మృతి చెందేవాడా అని ప్రశ్నించారు. యువకులిద్దరినీ కళ్లముందే కొడుతుంటే సిబ్బందిలేరు అంటూ పోలీసులు అసమర్థపాత్ర పోషించటం దురదృష్టకరమన్నారు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సర్కిల్‌ పరిధిలోని అధికారులను అప్రమత్తం చేసి ఉంటే ఓ నిండు ప్రాణం బలికాకుండా ఉండేదన్నారు. సర్కిల్‌ పరిధిలో హోమ్‌గార్డు నుంచి సర్కిల్‌ అధికారి వరకు టీడీపీ నాయకులు చేస్తున్న భూదందాలు, సెటిల్‌మెంట్లలో, వ్యాపారాలలో భాగస్వాములుగా మారుతుండటం హేయమన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు కొమ్ముకాస్తూ చట్టాన్ని నవ్వులపాలు చేస్తున్నారని విమర్శించారు.  పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోని దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొటంతో ప్రజలకు పోలీసులపై విశ్వాçÜం దెబ్బతిందన్నారు. అన్నదమ్ముల్లా కలసి ఉండే అడవులదీవి గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయేందుకు ఈ సంఘటన కారణమయిందని, కల్మషం లేని మనస్సుల మధ్య చిచ్చురేపిందన్నారు.  టీడీపీ అధికారం చేపట్టిన రెండేళ్లలో నియోజకవర్గంలో హత్యల పరంపర కొనసాగటం, దౌర్జన్యాలు పెచ్చుమీరడం, భూదందాలు, సెటిల్‌మెంట్లతో ప్రజలు అశాంతికి లోనవుతున్నారన్నారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా  చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జాస్మిన్, శ్రీసాయి మృతిలో నిజనిజాలను నిర్ధారించి దోషులను కఠినంగా శిక్షించాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ పట్టణ, రూరల్‌ కన్వీనర్‌లు గడ్డం రాధాకృష్ణమూర్తి, గాదే వెంకయ్యబాబు, పట్టణ మహిళా కన్వీనర్‌ కొత్తపల్లి శ్రీవాణి, యువత పట్టణ కన్వీనర్‌ చిత్రాల ఓబేదు, ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జర్లమూడి ప్రశాంత్‌కుమార్, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా శ్రీనివాసరావు, యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిమటా బాలాజీ, మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ సుభాని, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కొమ్మూరి వీరబ్రహ్మేంద్రస్వామి, కౌన్సిలర్‌ జూలకంటి బుజ్జిబాబు, తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement