Sakshi News home page

పోలీసు నిర్బంధంపై అఖిలపక్షం ఖండన

Published Sun, Nov 20 2016 10:02 PM

police arresteds issue very bad

  • తొండంగి మండలంలో సెక్ష¯ŒS 144 తొలగించాలని డిమాండ్‌
  • కాకినాడ సిటీ:
    జిల్లాలో జరుగుతున్న ప్రజా ఉద్యమాలపై పోలీసు నిర్బంధాన్ని ఖండిస్తూ అఖిలపక్ష పార్టీలు, సంఘాలు తీర్మానించాయి. ఆదివారం సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జీ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీలు, సంఘాల సమావేశం స్థానిక సుందరయ్యభవ¯ŒSలో జరిగింది. ఈ సందర్భంగా శేషబాబ్జీ మాట్లాడుతూ దివీస్‌ నిర్మాణ ప్రాంతంలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు జిల్లా పోలీసులను ఆదేశించినప్పటికీ తనను అరెస్ట్‌ చేసి నిర్బంధించారన్నారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారని, జిల్లాలో కరవాక, గండేపల్లి, జగ్గంపేట ప్రాంతాల్లో ప్రజలు వివిధ సమస్యలపై ఉద్యమిస్తుంటే పోలీసులు తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కాపు ఉద్యమ నాయకుల గృహ నిర్భంధాలు, పాదయాత్రలను అడ్డుకోవడం వంటి చర్యలు ఎమర్జన్సీ కన్నా దారుణంగా ఉన్నాయన్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసురాజ్యం నడుపుతున్నారన్నారు. దివీస్‌ విషయంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్‌పీఐ సీనియర్‌ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు, సీపీఐ నాయకుడు జుత్తుక కుమార్,  లోక్‌సత్తా నాయకుడు శివరామకృష్ణ, మాలమహానాడు నాయకులు పండు అశోక్, దళితసత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ ఫోరం కార్యదర్శి టి.నూకరాజు, మత్స్యకార నాయకులు కాలాడి జయన్నారాయణ, కేవీపీఎస్‌ మెల్లిమి డేవిడ్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించారు. తొండంగిలో 144 సెక్షన్, జిల్లాలో సెక్ష¯ŒS 30 తొలగించాలని డిమాండ్‌ చేశారు. బీఎస్పీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు, లిబరేష¯ŒS నాయకులు నాగేశ్వరరావు ఒక ప్రకటనలో ప్రభుత్వ చర్యలను ఖండించారు. 
      
     

Advertisement
Advertisement