నంద్యాలలో టీడీపీ కక్ష సాధింపు | Sakshi
Sakshi News home page

నంద్యాలలో టీడీపీ కక్ష సాధింపు

Published Fri, Aug 11 2017 12:33 PM

నంద్యాలలో టీడీపీ కక్ష సాధింపు

నంద్యాల: ఏపీలో అధికార టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యాలు తారాస్థాయికి చేరాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రత్యర్థులను నిలువరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. నంద్యాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధి శిల్పా మోహన్‌రెడ్డి వర్గీయుడికి చెందిన మెడికల్‌ షాపులో పోలీసులు గురువారం అర్థరాత్రి సోదాలు నిర్వహించారు. ఆధారాలు చూపినా రూ.3.57 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

తాను లయన్స్‌ క్లబ్‌ తరపున సేవా కార్యక్రమాలకు వినియోగించేందుకు ఉంచిన డబ్బును పోలీసులు సీజ్‌ చేశారని మెడికల్‌ షాపు యజమాని రమేశ్‌బాబు మీడియాకు తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ సభ్యులు కట్టిన డబ్బులని చెప్పినా, రశీదులు చూపించినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. అర్థరాత్రి తమ ఇంటికి వచ్చి కిటికీ పగలగొట్టి లోపలకు చొచ్చుకొచ్చారని చెప్పారు. తాను ఎటువంటి రాజకీయ ప్రచారం చేయలేదని తెలిపారు. శిల్పా మోహన్‌రెడ్డి మద్దతుదారులమన్న ఏకైక కారణంతో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

రమేశ్‌ ఇంటిపై దాడిని వైఎస్సార్‌ పీపీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం ఎంత దౌర్జన్యం చేసినా తమ కార్యకర్తలు భయపడరని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అర్థరాత్రి వ్యాపారి రమేశ్‌ ఇంటి తలుపు బద్దలుకొట్టి డబ్బులు పట్టుకెళ్లారని, సేవా కార్యక్రమాలకు చెందిన డబ్బు అని చెప్పినా పోలీసులు వినలేదని తెలిపారు. చంద్రబాబు బెదిరింపులు, దౌర్జన్యాలు మానుకోవాలని హితవు పలికారు.



Advertisement
Advertisement