శంషాబాద్‌లో నోట్ల కట్టల లారీ? | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో నోట్ల కట్టల లారీ?

Published Fri, Dec 9 2016 10:39 AM

శంషాబాద్‌లో నోట్ల కట్టల లారీ? - Sakshi

హైదరాబాద్: శంషాబాద్ పోలీసులు కరెన్సీ నోట్లతో వెళ్తున్న లారీని పట్టుకున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలిచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు లారీలో సోదా చేయగా నోట్ల కట్టలు కనిపించినట్లు తెలుస్తోంది.

దీంతో లారీని, దానిని అనుసరించి వస్తున్న జీపును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై పోలీసు అధికారులెవరూ సమాచారం ఇవ్వటం లేదు. రూ. 500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన తర్వాత నల్లకుబేరులు పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని మార్చుకోవడాని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఐటీ అధికారుల సోదాల్లో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెద్ద మొత్తం నల్లడబ్బు బయటపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఓ లారీలో పెద్ద మొత్తంలో డబ్బును శంషాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్న వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. లారీలో ఉన్నవి కొత్తనోట్లా లేక రద్దయిన పాత నోట్లా.. అవి ఎవరికి సంబంధించినవి.. అనేది తేలాల్సి ఉంది.
 

Advertisement
Advertisement