టైర్ పంక్చర్.. పోలీసు వాహనం బోల్తా | Sakshi
Sakshi News home page

టైర్ పంక్చర్.. పోలీసు వాహనం బోల్తా

Published Sun, Oct 9 2016 5:40 PM

police vehicle slipped and some injured

మునగాల: నల్గొండ జిల్లా మునగాల మండలం బరాకత్‌గూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై ఓ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. వీరంతా సుమోలో హైదరాబాద్ నుంచి మంగళగిరి వెళ్తుండగా బరాకత్‌గూడెం వద్దకు రాగానే వెనక టైరు పంక్చరై బోల్తాపడింది. క్షతగాత్రులను హుటాహుటిన కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement