భారీ ఎర్రచందనం డంప్‌ స్వాధీనం | Sakshi
Sakshi News home page

భారీ ఎర్రచందనం డంప్‌ స్వాధీనం

Published Wed, Jul 27 2016 12:53 AM

భారీ ఎర్రచందనం డంప్‌ స్వాధీనం

కడప అర్బన్‌:
వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరు మండల పరిధిలోని వాగేటికోనలో స్పెషల్‌ పార్టీ పోలీసులు ఎర్రచందనం డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్‌డీ(ఆపరేషన్స్‌) సత్య ఏసుబాబు తెలిపారు. స్పెషల్‌ పార్టీ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ డంప్‌ బయటపడిందన్నారు. ఈ డంప్‌లో దాదాపు రూ. 2 కోట్ల రూపాయల విలువైన, మూడు టన్నుల బరువున్న  87 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వాగేటికోన, కంజిమడుగు ప్రాంతాల్లో కూంబింగ్‌ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement