పోస్టుమెన్ నిర్లక్ష్యంతో ఇంటర్వ్యూ కోల్పోయిన నిరుద్యోగి | Sakshi
Sakshi News home page

పోస్టుమెన్ నిర్లక్ష్యంతో ఇంటర్వ్యూ కోల్పోయిన నిరుద్యోగి

Published Sat, Jul 2 2016 2:14 AM

పోస్టుమెన్ నిర్లక్ష్యంతో ఇంటర్వ్యూ కోల్పోయిన నిరుద్యోగి - Sakshi

మనూరు: పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు ఇంటర్వ్యూను కోల్పోయాడు. బాధితుడు భూతపిల్లి తుకారాం శుక్రవారం స్థానిక విలేకరుల ముందు తన గోడును వెల్లబోసుకున్నాడు. మండలంలోని మాయికోడ్ గ్రామానికి చెందిన యువకుడు బి.తుకారామ్‌కు జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి  భారత్ పెట్రోలియంలో ఉపాధి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని 6న  ఇంటర్వ్యూకు హాజరవ్వాలని జూన్ 4 న నారాయణఖేడ్ ఫోస్టాఫీస్‌కు రిజిస్టర్ పోస్టు వచ్చింది. ఈ క్రమంలో సంబంధిత పోస్టును ఖేడ్ పోస్టు కార్యాలయ సిబ్బంది మాయికోడ్ పోస్టుమెన్‌కు అదే రోజు అందచేశారు.

అయితే గ్రామానికి చెందిన పోస్టుమ్యాన్ సుధాకర్ సంబంధిత రిజష్టర్ పోస్టును యువకుడికి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వచ్చిన రోజు కాకుండా  18న సదరు రిజిష్టర్ పోస్టును కుటుంబీకులకు ఇచ్చి సంతకం తీసుకోకుండానే వెళ్లిపోయాడు. కాల్‌లెటర్ చూసిన యువకుడు పోస్టుమెన్ నిర్లక్ష్యం కారణంగా తాను ఉపాధి కోల్పోయానని మనోవేదనకు గురయ్యాడు. కాగా పోస్టుమెన్ పుండ్లిక్‌పై చర్యలు తీసుకోవాలని తాను జిల్లా పోస్టాఫీసులో ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. ఇక ముందు పోస్టుమెన్‌లు నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు తాను సంబంధిత పోస్టుమెన్‌పై న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నాడు. కాగా ఖేడ్ పరిధిలోని పోస్టుమెన్‌లు నిర్లక్ష్యంగా, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాలకు చెందిన పలువురు యువకులు పేర్కొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పోస్టుమెన్‌లు నిర్లక్ష్యం వహించకుండా తగు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement