‘వృత్తి, కళా విద్యాబోధకులను కొనసాగించాలి’ | Sakshi
Sakshi News home page

‘వృత్తి, కళా విద్యాబోధకులను కొనసాగించాలి’

Published Thu, Jul 21 2016 12:52 AM

‘వృత్తి, కళా విద్యాబోధకులను కొనసాగించాలి’

నిజామాబాద్‌ సిటీ : తెలంగాణ వృత్తులు, కళా విద్యా బోధకులను కొనసాగించాలని కోరుతూ పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్స్‌ ఐక్య కార్యాచరణ కమిటీ(పీటీఐ జేఏసీ) సభ్యులు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి వినతి పత్రం అందజేశారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కడియం శ్రీహరిని కలిసి కేంద్ర నిధుల సహకారంతో పనిచేస్తున్న బోధకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పీటీఐ జేఏసీ సభ్యులు కోరారు. నాలుగేళ్లుగా విద్యార్థులకు వృత్తి, కళా విద్యను బోధిస్తున్నారని, ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై నెల దాటినా తిరిగి వారిని కొనసాగించకపోవడంతో మూడు వేల మంది తెలంగాణ కళాకారుల కుటుంబాలు వీధిన పడ్డాయని మంత్రికి విన్నవించారు. ఈమేరకు మంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం 22న చర్చిస్తానని హమీ ఇచ్చారని జేఏసీ చైర్మన్‌ కేశవకుమార్‌ తెలిపారు. తెలంగాణ వృత్తి కళా విద్యా బోధకులను విద్యావలంటీర్లుగా తాత్కాలిక పద్ధతిన నియామకం చేయాలనే ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement