సిరులు కురిపిస్తున్న ఆగాకర | Sakshi
Sakshi News home page

సిరులు కురిపిస్తున్న ఆగాకర

Published Sun, Jul 24 2016 5:21 PM

సిరులు కురిపిస్తున్న ఆగాకర

సిరులు కురిపిస్తున్న ఆగాకర
profit send agakara.సిరులు కురిపిస్తున్న ఆగాకర
సిరులుకురిపిస్తున్న,ఆగాకర, రూ. లక్షలు ఆర్జిస్తున్న రైతులు
గొలుగొండ: ఆగాకర సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. నర్సీపట్నం డివిజన్‌లో కరక, దోనిపాలెం, వడపర్తి, కొత్త ఎల్లవరం, చోద్యం, లింగంపేట ప్రాంతాల్లో ఈ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మార్కెటింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉన్నందున రైతులకు మంచి ఆదాయం వస్తోంది. వ్యాపారులే రైతుల వద్దకు వచ్చి కిలో రూ.110 వంతున కొనుగోలు చేస్తున్నారు. ఎకరా పంట వేసేందుకు రూ.10 వేలు వరకు పెట్టుబడి అవుతోంది. ఆదాయం రూ. లక్ష వరకు వస్తుందని రైతులు తెలిపారు. 20 రోజులు క్రితం కిలో ఆగాకర రూ.140కు విక్రయించగా, కొద్దిరోజులుగా ధర రూ.110కి తగ్గిపోయింది. అయినప్పటికీ లాభదాయకంగానే ఉందని రైతులు తెలిపారు. రైతులు పండించిన ఈ పంటకు వారు నిర్ణయించిన ధరకు అమ్మకాలు జరగవు. ఆగాకర విషయంలో అలా కాదు. రైతులు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతుంటారు. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నందున రైతుల వద్ద సరుకు హాట్‌ కేక్‌లా వ్యాపారులు తీసుకువెళతారు. సాగు చేపట్టిన రైతులకు ఉద్యానవనశాఖ ప్రభుత్వ పరంగా రైతులు అందజేస్తోంది. లింగంపేటకు చెందిన రైతు మరిశా స్వామినాయుడు మాట్లాడుతూ 40 సెంట్లలో చేపట్టిన ఆగాకర సాగులో ఒక దఫా కాయలు సేకరిస్తే రూ.20 వేలు ఆదాయం వచ్చింది. నాలుగు సార్లు సేకరిస్తే సుమారు రూ.లక్ష వరకు ఆదాయం వస్తోంది. 
 
 

Advertisement
Advertisement