డ్వా'మాయ'! | Sakshi
Sakshi News home page

డ్వా'మాయ'!

Published Mon, Nov 28 2016 11:08 PM

డ్వా'మాయ'! - Sakshi

  •  నీటి యాజమాన్య సంస్థలో ఎఫ్‌టీఏలకు పదోన్నతులు
  • సీనియార్టీ జాబితా విడుదల చేసిన ఎస్‌ఆర్‌డీఎస్‌
  •   గోప్యంగా ఉంచిన అధికారులు
  • అనంతపురం టౌన్‌ : జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో సిబ్బందికి ఏపీఓలుగా పదోన్నతులు కల్పిస్తూ విడుదలైన సీనియార్టీ జాబితాను వెల్లడించకుండా కొందరు అధికారులు మాయ చేస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో కనీసం జాబితాను ప్రదర్శించిన దాఖలా లేదు.  

    ఎఫ్‌టీఏలకు ఉద్యోగోన్నతి : ఉపాధి హామీ, సమగ్ర వాటర్‌షెడ్‌ పథకం కింద జిల్లాలో 560 మంది ఎఫ్‌టీఏ (స్థిరకాల ఉద్యోగులు)లు పని చేస్తున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్లు (సీఓ) 135 మంది, టెక్నికల్‌ అసిస్టెంట్లు (టీఏ) 284 మంది ఉన్నారు. వీరిలో కొందరికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ సీనియార్టీ జాబితాను గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఎస్‌ఆర్‌డీఎస్‌) సెక్రటరీ కె.ప్రభాకర్‌ చౌదరి విడుదల చేశారు. 

    సీనియార్టీ జాబితాలో ఉన్నది వీరే :

    – ఏపీఓగా ఉన్న చిన్న మద్దులేటి, సీడీ–సీఎల్‌ఆర్‌సీగా ఉన్న టీడీ రామమూర్తి, ప్లాంటేషన్‌ మేనేజర్‌గా ఉన్న ఎస్‌.మధుబాబు ఏపీడీ పోస్టుకు అర్హులు.

    – కంప్యూటర్‌ ఆపరేటర్లు  హరిప్రసాద్, కుమ్మర ఆదెప్ప, పుట్లూరు సుజాత, పి.శివయ్య, సాకే నారాయణస్వామి, నాగేశ్వరయ్య, లలితదేవి, టీఏలుగా ఉన్న మాదెప్ప, శ్రీనివాసులు ఏపీఓ పోస్టుకు అర్హులు.

    – కంప్యూటర్‌ ఆపరేటర్‌ వేణుగోపాల్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ పోస్టుకు, మేనేజర్‌ డీబీటీ పోస్టుకు అర్హుడు.

    – అడిషనల్‌ డీఆర్‌పీ పోస్టుకు కంప్యూటర్‌ ఆపరేటర్లు రహంతుల్లా, అనిల్‌కుమార్, రామచంద్రారావు, టెక్నికల్‌ అసిస్టెంట్లు అమ్రేశ్, వేణుగోపాల్‌రెడ్డి õఅర్హులు.

    – సీడీ–సీఎల్‌ఆర్‌సీ పోస్టుకు టెక్నికల్‌ అసిస్టెంట్‌ మాదెప్ప, ఈసీ పోస్టుకు జేఈ మధుసూదన్‌రెడ్డి అర్హులు.

    – టెక్నికల్‌ అసిస్టెంట్లు రవీంద్రనాథ్, వెంకటేశ్వర్లు, చక్రపాణి శ్రీధర్, జితేంద్ర, నాగముణి కుమార్, హెచ్‌ఎన్‌ సుధాకర్, లక్ష్మినారాయణమ్మ, సురేశ్‌బాబు, అరుణ, దామోదరప్రసాద్, రాజు, దినేశ్, నారాయణస్వామి, గీత, బీబీ హజారా, నాగవేణిలు జేఈగా పదోన్నతులకు అర్హులు.

    జిల్లా నీటి యాజమాన్య సంస్థ : సీనియార్టీ జాబితాను గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన హెచ్‌ఆర్‌ఎంఎస్‌ (హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) వెబ్‌సైట్‌లోని వివరాల ఆధారంగా రూపొందించారు. వాస్తవానికి డేట్‌ ఆఫ్‌ జాయినింగ్, డేట్‌ ఆఫ్‌ బర్త్, ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్సే కాకుండా వారి పనితీరును కూడా పరిగణలోకి తీసుకోవాలి. గతంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా? కేసులేమైనా ఉన్నాయా? పెనాల్టీ విధించారా? దిగమింగిన సొమ్మును రికవరీ చేశారా? అన్న వివరాలు పొందుపరచాలి. కానీ ఇలాంటి వివరాలేవీ ప్రస్తుత జాబితాలో లేవు. జాబితాను ప్రదర్శిస్తే ఇతరుల నుంచి అభ్యంతరాలు వస్తాయన్న కారణంగానే అంతా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement