వాడపల్లి వంతెన వద్ద ఆందోళన | Sakshi
Sakshi News home page

వాడపల్లి వంతెన వద్ద ఆందోళన

Published Wed, Oct 5 2016 9:55 PM

వాడపల్లి వంతెన వద్ద ఆందోళన

వాడపల్లి (దామరచర్ల) : ఆంధ్రా నుంచి ఇసుక రవాణా చేస్తున్న లారీలను ఏపీ పోలీసులు ఆపుతున్నారని, వెంటనే విడుదల చే యాలని డిమాండ్‌ చేస్తూ లారీ యజమానులు, కార్మికులు బుధవారం మండలంలోని వాడపల్లి వద్ద కృష్ణానది వంతెనపై రాస్తారోకో చేపట్టారు. గంట పాటు రాస్తారోకో చేయడంతో వందలాది వాహనాలు సుమారు 3కి.మీల మేర నిలిచి పోయాయి. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా లారీ అసోసియేషన్‌ అధ్యక్షుడు నుర్వి యాదయ్యగౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇసుక లారీలకు  అన్ని రకాల వేబిల్స్‌ ఉన్నా మూడు రోజులుగా ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు కృష్ణానది ఆవలి ఒడ్డున ఆపారన్నారు. ఇసుకపై ఆధిపత్యం కోసం ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఇరువురు ఎమ్మెల్యేలు గొడవలు పడి పోలీసులను పురమాయించి తమ లారీలను నిలిపివే శారన్నారు. తెలంగాణ  ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. 
ఏపీ పోలీసులతో చర్చలు : రాస్తారోకో విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్‌ సీఐ రవీందర్‌ సంఘటనా స్థలానికి చేరుకునిఆందోళన కారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏపీ పోలీసులతో చర్చించారు. బిల్లులున్న లారీలను వెంటనే పంపివేయాలని కోరారు. దీనికి ఏపీ పోలీసులు సానుకూలంగా స్పందించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి ట్రైనీ ఎస్‌ఐ రామన్‌గౌడ్, మండల లారీ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుగులోత్‌ వీరబాబు, హైదరాబాద్‌ అసోసియేషన్‌ నాయకులు పెద్దయ్య, రాజేందర్‌రెడ్డి, రవీందర్‌ గౌడ్, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement