ఏ ఘాటుకు ఎంత చార్జి? | Sakshi
Sakshi News home page

ఏ ఘాటుకు ఎంత చార్జి?

Published Thu, Aug 11 2016 5:19 PM

ఏ ఘాటుకు ఎంత చార్జి? - Sakshi

కర్నూలు(రాజ్‌విహార్‌): కృష్ణా పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుష్కర స్నానం చేసి పునీతులు అయ్యేందుకు కుటుంబ సభ్యులందరూ సిద్ధమవుతుంటారు. నదీ స్నానం చేసేందుకు ఏ ఘాటుకు వెళ్దాం.. ఎలా వెళ్దాం.. ఎంత దూరం ఉంటుంది.. ఆర్టీసీ చార్జీలు ఎంత ఉంటాయి.. పిల్లలకు బస్సుల్లో ఎంత తీసుకుంటారు.. సమీపంలోని ఊరి నుంచి ఫలాన ఘాటుకు వెళ్లోస్తే చార్జీలు ఎంతవుతాయి.. అని భక్తులు లెక్కలు వేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో  ఆర్టీసీ చార్జీల వివరాలు ఇస్తున్నాం..
చార్జీల వివరాలు..
 
నుంచి వరకు        కిలో మీటర్లు     పెద్దల చార్జీ         పిల్లల చార్జీ
 
కర్నూలు శ్రీశైలం         195            రూ.225         రూ.115
కర్నూలు సంగమేశ్వరం 104          రూ.110          రూ.60
కర్నూలు బీచుపల్లి      51               రూ.60           రూ.35
ఆత్మకూరు సంగమేశ్వరం 45           రూ.50           రూ.25
నందికొట్కూరు సంగమేశ్వరం 72      రూ.65           రూ.34
నంద్యాల బస్టాండ్‌ లింగాలగటు 176  రూ.210           రూ.110
నందికొట్కూరు నెహ్రూనగర్‌ 15         రూ.15           రూ.12
సంగమేశ్వరం శ్రీశైలం 168               రూ.148            రూ.75
నంద్యాల శ్రీశైలం 176                        రూ.155            రూ.78
మంత్రాలయం శ్రీశైలం 286                రూ.306            రూ.156
ఆళ్లగడ్డ శ్రీశైలం 221                           రూ.250            రూ.130
కోవెలకుంట్ల శ్రీశైలం 218                      రూ.250          రూ.130
బనగానపల్లె శ్రీశైలం 223                   రూ.250            రూ.130
ఎమ్మిగనూరు శ్రీశైలం 262               రూ.285            రూ.145
ఆదోని శ్రీశైలం 292                         రూ.310            రూ.160
ఆత్మకూరు శ్రీశైలం 123                రూ.160                రూ.85
కర్నూలు విజయవాడ 342            రూ.300             రూ.152
నంద్యాల విజయవాడ 327             రూ.286            రూ.145
శ్రీశైలం విజయవాడ 272              రూ.238               రూ.120
 
 గమనిక: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులను మాత్రమే నడుపుతోంది. ఆయా బస్సుల్లో కిలో మీటరుకు 0.87పైసల చొప్పున వసూలు చేస్తారు. ఈ చార్జీలపై ఆర్టీసీ డెవెలప్‌మెంట్‌ సెస్సు, రిజర్వేషన్‌ చార్జీ, ప్యాసింజరు ఇన్ఫర్మేషన్‌ చార్జీ, ఘాట్‌ రూట్లలో ఒక కిలో మీటరుకు వసూలు చేసే రూ.1.74ను కూడా కలిపి టికెట్‌ ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన చార్జీల్లో కొద్దిగా తేడా ఉండవచ్చు.
 

Advertisement
Advertisement