పెద్దదోర్నాలలో పుష్కరనగర్‌ | Sakshi
Sakshi News home page

పెద్దదోర్నాలలో పుష్కరనగర్‌

Published Wed, Aug 3 2016 9:30 PM

పెద్దదోర్నాలలో పుష్కరనగర్‌

  •   కృష్ణా పుష్కరాలకు మెరుగైన సౌకర్యాలు
  •   కర్నూలు జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌
  •   ఏర్పాట్ల పర్యవేక్షిస్తున్న కర్నూలు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సత్యం
  •  పెద్దదోర్నాల:  పెద్దదోర్నాలలో పుష్కరనగర్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ తెలిపారు. కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర నలుమూలల నుంచి శ్రీశైలనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతుల కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మార్కాపురం ఆర్డీఓ చంద్రశేఖరరావుతో కలిసి బుధవారం పెద్దదోర్నాలలోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
     
     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12వ తేదీ నుంచి 12 రోజుల పాటు జరిగే కృష్ణా పుష్కరాలకు యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలతో పుష్కరనగర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరుగుదొడ్లు, స్నానపుగదులు, దాతల సహకారంతో భోజన సౌకర్యం, విశ్రాంతి మందిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
     
    ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కర్నూలు జిల్లాకు చెందిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సత్యంను నియమించినట్లు తెలిపారు. ట్రాఫిక్‌ నియంత్రణ, పారిశుద్ధ్య ప్రమాణాలు, తాగునీటి వసతి, వైద్యశిబిరాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  కర్నూలు జిల్లా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సత్యం, తహశీల్దార్‌ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాసులు, సర్పంచ్‌ మరియమ్మ, పంచాయతీ కార్యదర్శి జైరాం నాయక్‌ పాల్గొన్నారు. అంతకు ముందు స్థానిక బొగ్గరపు సత్యమమ్మ కల్యాణ మండపంలో ఆర్డీఓ చంద్రశేఖరరావు పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాసరావు, అటవీశాఖ ఏసీఎఫ్‌ హిమశైలజ పాల్గొన్నారు.    

Advertisement
Advertisement