పుష్కరస్నానంతో పునీతం | Sakshi
Sakshi News home page

పుష్కరస్నానంతో పునీతం

Published Sun, Jul 31 2016 12:00 AM

బీచుపల్లి ప్రధాన ఆలయ పూజారి ప్రహ్లాదచారి

 అన్ని పాపాలు తొలగిపోతాయి 
 గురుడు కన్యారాశిలో ప్రవేశంతో ‘పుష్కర’ం ప్రారంభం 
 ‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీచుపల్లి ప్రధాన అర్చకుడు ప్రహ్లాదచారి
 
పుష్కర సమయంలో నదిలో స్నానాలు ఆచరించడం ద్వారా దీర్ఘకాలిక రోగాలు మాయమవుతాయని, కోటి జన్మలలో చేసిన పాపం తొలగిపోతుందని బీచుపల్లి పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ప్రహ్లాదచారి అంటున్నారు. కృష్ణా పుష్కరస్నానం కోసం రాష్ట్రంలో బీచుపల్లికే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పారు. ఈ క్షేత్రం వద్ద కృష్ణానది దక్షిణ వాయువ్యదిశగా ప్రవహిస్తోందని, మహాబలేశ్వరంలో నది పుట్టిన ప్రాంతం నుంచి హంసల దీవిలో సముద్రంలో కలిసే వరకు ఎక్కడా కృష్ణమ్మ ఇలా ప్రవహించదన్నారు. బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద ఇదే ఎంతో ప్రత్యేకమైనది పేర్కొన్నారు. పుష్కరస్నానం ఆచరించడం వల్ల ¿¶ క్తులకు కలిగే ప్రయోజనాలు, వాటి ఫలితాలు, బీచుపల్లి తదితర అంశాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లో..
– ఇటిక్యాల
 
పుష్కరస్నానంపై భక్తులకు అవగాహన 
శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసరాయలు బీచుపల్లి పుణ్యక్షేత్రంలో క్రీ.శ.1487లో ఆభయాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నిత్యం ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. నేను అర్చకుడిగా ఉన్నప్పటి నుంచి బీచుపల్లి వద్ద మూడుసార్లు కృష్ణా పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు నిర్వహించే పుష్కరాలు నాలుగోసారి అవుతాయి. మొదట 1980లో జరిగిన కృష్ణాపుష్కరాలు కేవలం ఆధ్యాత్మిక అవగాహన ఉన్న భక్తులు మాత్రమే పుష్కరాలకు హాజరయ్యారు. 1992లో జరిగిన పుష్కరాలపై భక్తులకు అవగాహన కొరవడి ఎక్కువ సంఖ్యలో రాలేదు. కానీ 2004లో దాదాపు 80శాతం మంది భక్తులకు పుష్కర స్నానంపై అవగాహన వచ్చింది. దీంతో బీచుపల్లిలో ఆ ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజÔó ఖరరెడ్డి పుష్కరాల ప్రారంభోత్సవానికి, ముగింపునకు హాజరయ్యారు. ప్రస్తుతం పుష్కరాలపై భక్తులకు పూర్తి అవగాహన కలిగి ఉండటంతో ఈ ఏడాది 50లక్షల మందికి పైగా బీచుపల్లిలో పుణ్యక్షేత్రంలో పుష్కరస్నానం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
 
దేవతలతో పాటు భక్తుల పుణ్యస్నానం 
ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం మొదలుతో పుష్కరం ప్రారంభమవుతుంది. అదే నెల 23వతేదీ సూర్యాస్తమయం వరకు భక్తులు పుష్కరస్నానం ఆచరించవచ్చు. గురువు (బృహస్పతి) కన్యారాశిలో ప్రవేశించినప్పుడు పుష్కర సమయం ప్రారంభమవుతుంది. పుష్కర సమయం ప్రారంభంలో ముక్కోటి దేవతలు నదిలో స్నానాలు ఆచరిస్తారు. పుష్కరాలు జరిగే 12 రోజులు... ఒక్కో ప్రత్యేక రోజులుగా ముక్కోటి దేవతామూర్తులు స్నానమాచరించే సమయంలో భక్తులు సైతం పుష్కర స్నానాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. 
 
పుష్కర శ్లోకం..
పుష్కరాలలో పాల్గొనే భక్తులు ఈ శ్లోకంను స్మరించుకుంటూ పుణ్యస్నానం ఆచరిస్తే మంచి జరుగుతుంది. 
‘గంగేచ యమున  చైవ
గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావేరి
జలస్మిమ్‌ సన్నిబింకుర్‌’ అంటూ నదిలో స్నానమాచరించే సమయంలో మనసులో స్మరించుకోవాలి. దీంతో అన్ని నదులలో పుణ్యస్నానమాచరించిన ఫలితం దక్కుతుంది. 
 
భక్తులు చేయాల్సిన దానాలు..
పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు పుష్కరాలు జరిగే 12రోజుల పాటు భక్తులు దానధర్మాలు చేయాల్సి ఉంటుంది. స్నానమాచరించిన తరువాత ఒకటో రోజు బంగారం, వెండి, ధాన్యం, భూమి, అన్నదానం చేయాలి. రెండోరోజు ఆవు, రత్నాలు, ఉప్పు, మూడోరోజు పండ్లు, కూరలు, బెల్లం, వెండితో చేసిన గుర్రం బొమ్మ, నాలుగో రోజు నెయ్యి, నూనె, తేనె, పాలు, చక్కెర, 5వ రోజు ధాన్యం, పండ్లు, గేదెలు, నాగలి, 6వ రోజు మంచి గంధపు చెక్క, కర్పూరం, కస్తూరి, ఔషధాలు, 7వ రోజు ఇల్లు, వాహనం, కూర్చొనే ఆసనం, 8వ రోజు పూలు, అల్లం, గంధపు చెక్క, 9వ రోజు కన్యాదానం, పిండ ప్రదానం, 10వ రోజు హరిహర పూజ, లక్ష్మిపూజ, నదిపూజ, గౌరిపూజ, 11వ రోజు వాహనం, పుస్తకాలు, తాంబూలం, 12వ రోజు నువ్వులు, మేకలను పేదవారికి దానం చేస్తే పుణ్యం కలుగుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement