రబీకి రెడీ | Sakshi
Sakshi News home page

రబీకి రెడీ

Published Fri, Sep 30 2016 12:10 AM

రబీకి రెడీ

  • ఖరారైన సాగు ప్రణాళిక
  • సాగు 71,519 హెక్టార్లు.. విత్తనాలు 7,195 క్వింటాళ్లు
  • వర్షాలతో పెరుగుతున్న భూగర్భ జలాలు
  • ఆరుతడి, పప్పు దినుసుల పంటలకు ప్రాధాన్యం
  • ఖమ్మం వ్యవసాయం
    ఖరీఫ్‌ సాగు విభిన్నంగా ఉన్నా.. రైతులు మాత్రం రబీ సాగుకు రెడీ అవుతున్నారు. అక్టోబర్‌ నుంచి సీజ¯ŒS ప్రారంభం కానుండటంతో సాధారణ సాగు ప్రణాళికను ఖరారు చేశారు. జిల్లాలో 71,519 హెక్టార్లకు 7,195 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటాయని అధికారులు గుర్తించారు. ఆరుతడి పంటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. పప్పు దినుసుల సాగుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగి.. రబీ పంటలకు సమృద్ధిగా నీరందే పరిస్థితి ఉంది.     
    రబీ సీజ¯ŒS రానే వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ పంటల సాగు విభిన్నంగా ఉన్నా.. ఏజెన్సీలో అనుకూలించిన వర్షాలతో ఆశించిన మేరకు పంటలు సాగవుతున్నాయి. మైదాన ప్రాంతంలో ప్రధాన నీటి వనరు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులోకి నీరు చేరకపోవటంతో నీటి విడుదల లేక పంటలు సాగు చేయలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల సాగు చేయని భూముల్లో పంటలు వేసేందుకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో పాటు సాగర్‌ నీటిని కూడా విడుదల చేస్తే ఆయకట్టు భూముల్లో పంటలు పండే పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా.. రబీ సీజ¯ŒSకు వ్యవసాయ శాఖ రంగం సిద్ధం చేసింది. నిబంధనల ప్రకారం ప్రణాళికను ఖరారు చేసింది.  
    సాధారణ సాగు విస్తీర్ణం 71,519 హెక్టార్లు  
    71,519 హెక్టార్లను రబీ సాధారణ సాగు విస్తీర్ణంగా వ్యవసాయ శాఖ ప్రణాళికలో పేర్కొంది. వర్షపాతం, జలాశయాల్లో నీరు, వాతావరణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని సాగు విస్తీర్ణాన్ని రూపొందించింది. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు లేక ఆశించిన స్థాయిలో ఖరీఫ్‌లో వర్షపాతం పెరగలేదు. దీని ప్రభావం రబీ సాధారణ సాగు ప్రణాళికపై పడింది. వరి ప్రధాన పంట అయినప్పటికీ ఆశించిన మేరకు జలాశయాల్లో నీరు లేకపోవటంతో పంట సాధారణ సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24,804 హెక్టార్లుగా ప్రణాళికలో రూపొందించారు. వాణిజ్య పంటలైన మిర్చి, పొగాకు సాధారణ సాగు విస్తీర్ణం కూడా ఉంది. సాగర్‌ ఆయకట్టులో ఖరీఫ్‌లో సాగు చేయని భూముల్లో రబీ పంటల సాగుకు అనువైన పంటలను సాగు చేయాలని, దీనికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించారు. మొక్కజొన్న, జొన్న పంటలు 15,933 హెక్టార్లు, పప్పు దినుసులు 8,790 హెక్టార్లు, నూనెగింజల పంటలు 5,971 హెక్టార్లు, వాణిజ్య పంటల సాధారణ సాగు 16,021 హెక్టార్ల విస్తీర్ణంగా ప్రణాళిక రూపొందించారు. వీటితో పశుగ్రాసం పంటలు కూడా వేయాలని నిర్ణయించారు.  
    7,195 క్వింటాళ్ల విత్తనాలు
    రబీ పంటల సాగుకు 7,195 క్వింటాâýæ్ల విత్తనం అవసరంగా వ్యవసాయ శాఖ గుర్తించింది. వీటిలో 4,420 క్వింటాâýæ్ల విత్తనాలను సబ్సిడీపై, 2,775 క్వింటాâýæ్ల విత్తనాలు అదనంగా అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలో పేర్కొంది. రూపొందించిన ప్రణాళికను రాష్ట్ర వ్యవసాయ శాఖకు జిల్లా వ్యవసాయ శాఖ నివేదించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ వివిధ సంస్థల ద్వారా విత్తనాలను అందజేస్తుంది. ఈ విత్తనాల్లో ఆరుతడి పంటల విత్తనాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వరి కేవలం 3వేల క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. పప్పు దినుసులు, నూనె గింజల పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.  
    ‘ఆరుతడి’కే అధిక ప్రాధాన్యం
    నీటివనరులను దృష్టిలో పెట్టుకొని రబీలో ఆరుతడి పంటల సాగుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రెండు, మూడు తడులతో చేతికొచ్చే మొక్కజొన్న, పెసర, మినుము, కంది, అలసంద, బొబ్బెర వంటి పంటల సాగుతోపాటు నూనె గింజల పంటలైన వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి పంటల సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. దేశీయంగా కొరత ఉన్న పప్పుదినుసుల పంటల వైపునకు రైతులను దృష్టిసారించే విధంగా వ్యవ సాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఆయా పంటల సాగుకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచే విధంగా కూడా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది.

Advertisement
Advertisement