ఏర్పాట్లు పుష్కలంగా... | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లు పుష్కలంగా...

Published Mon, Aug 1 2016 6:11 PM

ఏర్పాట్లు పుష్కలంగా...

  • విశాఖరైల్వేస్టేషన్‌లో పూర్తయిన కృష్ణాపుష్కర  ఏర్పాట్లు
  •  ఓ రోజుముందు హెల్ప్‌డెస్క్‌ల నంబర్లు అందుబాట్లో..
  • విశాఖ మీదుగా పలు ప్రత్యేకరైళ్లతో సహా, సువిధా ఎక్స్‌ప్రెస్‌లు కూడా
  • తాటిచెట్లపాలెం:   ఈనెల 12 నప్రారంభంకానున్న కృష్ణాపుష్కరాల నేపథ్యంలో వాల్తేరుడివిజన్‌ కసరత్తుచేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాలనుంచి విశాఖమీదుగా ప్రత్యేకరైళ్లతో పాటు సువిధా ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతున్న ఈ శాఖ అందుకు అనుగుణంగానే ఏర్పాట్లనూ వేగవంతంచేస్తోంది. గోదావరి పుష్కరాలకు 6.3 లక్ష ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించిన నేపథ్యంలో, కష్ణాపుష్కరాలకు 3లక్షల పైచిలుకు ప్రయాణికులు రాకపోకలుసాగిస్తారని అంచనావేస్తున్న రైల్వేశాఖ ఆ స్థాయిలో ఏర్పాట్లను ముమ్మరంచేస్తోంది.
    ప్రత్యేకరైళ్ల ఇవే..
    రాయగడ–కృష్ణ కెనాల్‌ జంక్షన్‌–రాయగడ ప్రత్యేకరైలు(08505/06).
    రాయగడనుంచి బయలుదేరి వెళ్లే ఈ రైలు(08505) ఆగష్టు 11,16,19,22తేదీల్లో మధ్యాహ్నం 02.30 గంటలకు బయలుదేరి అదేరోజు సాయంత్రం 07.45 గంటలకు విశాఖ చేరుకుని, ఆ మర్నాడు తెల్లవారుజామున 04.15గంటలకు కృష్ణకెనాల్‌చేరుకుంటుంది.
    తిరుగుప్రయాణంలో 0806 నెంబరుతో కష్ణాకెనాల్‌జంక్షన్‌ నుంచి ఆగష్టు 12,17,20,23 తేదీల్లో రాత్రి 08.45 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 5గంటలకు విశాఖచేరుకుని అదేరోజు ఉదయం 9 గంటలకు రాయగడ చేరుకుంటుంది.
    ఓ థర్డ్‌ ఎ.సి, మూడు స్లీపర్‌క్లాసులు, 10 జనరల్‌సెకండ్‌క్లాస్‌ కోచ్‌ల కంపోజిషన్‌ఉన్న ఈ రైళ్లు పార్వతీపురం టౌన్, పార్వతీపురం,సీతానగరం, బొబ్బిలి, డొంకిన వలస, గజపతినగరం, గరుడబిల్లి, కొత్తవలస, సింహాచలం, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట,రాజమండ్రి, ఏలూరు, గుణదల, విజయవాడ మీదుగా   రాకపోకలు సాగిస్తాయి.
     
    విశాఖపట్నం–గుంటూరు–విశాఖపట్నం స్పెషల్‌(08507/08)
    విశాఖపట్నం నుంచి 08507 నెంబరుతో వెళ్లే ఈ రైలు ఆగష్టు 11,12,13,14,16,17,19,20,21,22 తేదీల్లో  రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.45 గంటలకు గుంటూరుచేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 08508 నెంబరుతో గుంటూరు నుంచి ఆగష్టు 12,13,14,15,17,18,20,21,22,23 తేదీల్లో ఉదయం 08.30 గంటలకు బయలుదేరి అదేరోజు సాయంత్రం 05.20 గంటలకు విశాఖచేరుకుంటుంది.ఐదు స్లీపర్,ఎనిమిది జనరల్‌సెకండ్‌ క్లాస్‌కోచ్‌ల సామర్థ్యమున్న ఈ జతరైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి,ఏలూరు,గుణదల,విజయవాడ,మంగళగిరి స్టేషన్లమీదుగా రాకపోకలు సాగిస్తాయి. 
     
    పూరి–గుంటూరు–పూరి స్పెషల్‌(08405/06)
    పూరి నుంచి 08405 నెంబరుతో ఆగష్టు 11,16,19,22 తేదీల్లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి  అదేరోజు రాత్రి 09.25 గంటలకు విశాఖచేరుకుని, ఆ మర్నాడు ఉదయం 06.30 గంటలకు గుంటూరుచేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 08406 నెంబరుతో గుంటూరు నుంచి ఆగష్టు 12,17,20,23 తేదీల్లో రాత్రి 7 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు తెల్లవారుజామున 03.20 గంటలకు విశాఖచేరుకుని అదేరోజు ఉదయం 11.25 గంటలకు పూరిచేరుకుంటుంది.
    ఓ థర్డ్‌ ఎ.సి, మూడు స్లీపర్,10 జనరల్‌ సెకండ్‌క్లాస్‌ కంపోజిషన్‌ ఉన్న ఈ రైళ్లు ఖుర్దారోడ్,బాల్గాన్,బ్రహ్మపూర్, ఇచ్చాపురం, సోంపేట, పలాస, నౌపడా,కోటబొమ్మాలి,తైలూరు, శ్రీకాకుళం రోడ్డు, దూసి, పొందూరు, సిగడం,చీపురుపల్లి, గరివిడి, విజయనగరం, విశాఖపట్నం,దువ్వాడ, అనకాపల్లి, తుని,అన్నవరం, సామర్లకోట,రాజమండ్రి,ఏలూరు, గుణదల,విజయవాడ, కష్ణ కెనాల్‌ జంక్షన్, మంగళగిరి ప్రాంతాలమీదుగా రాకపోకలు సాగిస్తాయి.
     
    విశాఖ–తిరుపతి–విశాఖ స్పెషల్‌(07747/48)
    విశాఖనుంచి తిరుపతి వెళ్లే ఈ రైలు(07748) ఆగష్టు 13,20 తేదీల్లో తెల్లవారుజామున 05.45 గంటలకు బయలుదేరి అదేరోజు సాయంత్రం  07.45 గంటలకు తిరుపతిచేరుకుంటుంది. 
    తిరుగుప్రయాణంలో 07747 నెంబరుతో తిరుపతినుంచి ఆగష్టు 12,19 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 2గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఓసెకండ్‌ ఎ.సి, మరోథర్డ్‌ ఎ.సి, ఏడుస్లీపర్, 6 జనరల్‌ సెకండ్‌క్లాస్‌ల కంపోజిషన్‌ ఉన్న ఈ రైళ్లు దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుణెదల, విజయవాడ, కష్ణకెనాల్, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు,శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లమీదుగా రాకపోకలు సాగిస్తాయి.
     
    విజయవాడ–విశాఖ– విజయవాడ స్పెషల్‌(07753/07754)
    విజయవాడ నుంచి బయలుదేరి విశాఖ వచ్చే 07753 నెంబరుగలరైలు ఆగష్టు 11,12,13,14,18,19,20 21 తేదీల్లో రాత్రి 11.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖచేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 07754 నెంబరుతో విశాఖనుంచి ఆగష్టు 12,13,14,15,19,20,22 తేదీల్లో ఉదయం 08.40 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 03.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఓ సెకండ్‌ ఎ.సి, మరో రెండు థర్డ్‌ ఎ.సి, ఏడుస్లీపర్‌ , 5 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కంపోజిషన్‌ఉన్న ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుణెదల ప్రాంతాలమీదుగా రాకపోకలుసాగిస్తుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ తెలిపింది.
    విశాఖ మీదుగా సువిధాప్రత్యేకరైళ్లు...
       సంబల్‌పూర్‌–యశ్వంత్‌పూర్‌ వయా  విశాఖ,రేణిగుంట మీదుగా సువిధాప్రత్యేకరైళ్లను  నాలుగుట్రిప్పులు  నడుపుతున్న రైళ్లవివరాలివే...
    సంబల్‌పూర్‌–యశ్వంత్‌పూర్‌ వీక్లీ సువిధా(82831/82832)...
    –సంబల్‌పూర్‌ నుంచి 082831 నెంబరుతో జూలై 27, ఆగష్టు 3,24,31 తేదీల్లో (బుధవారాల్లో) ఉదయం 11గంటలకు బయలుదేరే ఈ రైలు అదేరోజు సాయంత్రం7 గంటలకు విశాఖచేరుకుని ఆ మర్నాడు సాయంత్రం 04.40 గంటలకు యశ్వంత్‌పూర్‌చేరుకుంటుంది.
    తిరుగుప్రయాణంలో 082832 నెంబరుతో యశ్వంత్‌పూర్‌ నుంచి జూలై 29, ఆగష్టు 5,26 తేదీల్లో( గురువారం అర్ధరాత్రుల్లో ) 12.30 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 08.35 గంటలకు విశాఖచేరుకుని, ఆ మర్నాడు సాయంత్రం 4.40 గంటలకు సంబల్‌పూర్‌ చేరుకుంటుంది.
     ఓ సెకండ్‌ ఎ.సి, మూడు థర్డ్‌ ఎ.సి, 10స్లీపర్, మరో రెండు జనరల్‌ సెంకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌ కంపోజిషన్‌ఉన్న ఈ రైళ్లు బర్గారోడ్, బోలంగీర్,టిట్లాఘర్, కేసింగ, రాయగడ, విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణిగుంట, జోలారిపుట్టాయ్,కృష్ణరాజపురం స్టేషన్లమీదుగా రాకపోకలు సాగిస్తాయి. 
    జీఆర్పీ,ఆర్‌పీఎఫ్‌ సమాయుత్తం...
    స్టేషన్‌పరిసరప్రాంతాల్లో ఏ విధమైన అసాంఘికశక్తులు చొరబడకుండా, పూర్తి భద్రతాపరమైన ఏర్పాట్లను జీఆర్పీ, ఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా పరిశీలిస్తున్నాయి. నలుగురు జీఆర్పీ కానిస్టేబుళ్లకు ఓ ఎస్‌.ఐ స్థాయి అధికారిని నియమించి ఒడిశా, బీహార్‌ ప్రాంతాలమీదుగా విశాఖవచ్చే రైళ్లలో గస్తీనిర్వహిస్తున్నారు. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది స్టేషన్‌లో ప్రతి అంగులాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
     
    పూర్తిస్థాయిలో కౌంటర్ల పనితీరు..
    ఒకటోనెంబరు తో పాటు ఎనిమిదో నెంబరుప్లాట్‌ఫాంపై ఉన్న మొత్తం 10 కౌంటర్లు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. ఈ మేరకు అదనపు సిబ్బందిని నియమిస్తున్నారు.
     రెండు హెల్ప్‌డెస్క్‌లు..
    రైల్వేస్టేషన్‌ మెయిన్‌గేట్‌తో పాటు అటు జ్ఞానాపురంవైపు పూర్తిస్థాయిలో  రెండు హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటుచేస్తున్నారు.  వాటికి సంబంధించి ఎనిమిది నెంబర్లను . ఓ రోజుముందు  సీనియర్‌డీసీఎం విడుదలచేస్తారు.
    స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌:
    కౌంటర్‌దగ్గరక్యూపద్ధతి పాటించేలా,  వాటర్‌సమస్య తలెత్తినా, క్లౌడ్‌కంట్రోల్‌చేసే భాధ్యత స్కౌట్స్‌ అండ్‌ గౌడ్స్‌తీసుకుంటుంది. వీరు స్వచ్ఛందంగా సేవచేయనున్నారు. 
     

Advertisement
Advertisement