జిల్లా వ్యాప్తంగా వర్షం | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా వర్షం

Published Sat, Aug 26 2017 9:50 PM

rain from district wise

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్ర, శనివారం కూడా కొన్ని మండలాల్లో చెప్పుకోదగ్గ వర్షం కురవగా మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. శుక్రవారం అత్యధికంగా 10.7 మి.మీ, శనివారం 4.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. తలుపులలో 68.8 మి.మీ, ముదిగుబ్బలో 55.2 మి.మీ భారీ వర్షం కురిసింది. గాండ్లపెంట 39.4 మి.మీ, ఎన్‌పీ కుంట 30.6 మి.మీ, కదిరి 29.5 మి.మీ, పెద్దపప్పూరు 26 మి.మీ, నల్లమాడ 25.8 మి.మీ, తాడిపత్రి 25.4 మి.మీ, తాడిమర్రి 22.9 మి.మీ, యాడికి 21.3 మి.మీ, విడపనకల్‌ 21.1 మి.మీ, బుక్కపట్నం 19.6 మి.మీ, బత్తలపల్లి 19.1 మి.మీ, ధర్మవరం 16.2 మి.మీ, బత్తలపల్లి 16.2 మి.మీ, నార్పల 15.6 మి.మీ, ఉరవకొండ 14.6 మి.మీ, పుట్లూరు 14.5 మి.మీ, వజ్రకరూరు 14.5 మి.మీ, రాప్తాడు 14.2 మి.మీ, పెద్దవడుగూరు 13.8 మి.మీ, యల్లనూరు 13.7 మి.మీ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి.

ఆగస్టులో సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా వరుసగా కురుస్తున్న తేలికపాటి వర్షాల కారణంగా ఇప్పటికి 90.4 మి.మీ నమోదైంది. అలాగే జూన్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు 201.7 మి.మీ వర్షం పడాల్సి ఉండగా ప్రస్తుతానికి 180.6 మి.మీ నమోదైంది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు మంచి సమయమని శాస్త్రవేత్తలు, అధికారులు తెలిపారు. విత్తనాలు తీసుకెళ్లిన రైతులు ఈ వర్షానికి పంటలు వేసుకుంటే మేలన్నారు.

Advertisement
Advertisement