నాలుగు రోజుల్లో వర్షసూచన | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో వర్షసూచన

Published Tue, Jun 13 2017 7:57 PM

rain in four days

అనంతపురం అగ్రికల్చర్‌ : రానున్న నాలుగు రోజుల్లో చెప్పుకోదగ్గ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంటలోని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 7 నుంచి 35 మిల్లీమీటర్ల (మి.మీ) మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 31-32 డిగ్రీలు, కనిష్టం 22 -24 డిగ్రీల మధ్య నమోదుకావచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 76 -78, మధ్యాహ్నం 54- 59 మధ్య ఉంటుందన్నారు. గంటకు 12 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.

Advertisement
Advertisement