బాలికపై అత్యాచార యత్నం | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచార యత్నం

Published Fri, Dec 30 2016 10:30 PM

rape attempt on minor

ఎన్‌.రంగాపురం (ప్యాపిలి) : మండల పరిధిలోని ఎన్‌.రంగాపురం గ్రామానికి చెందిన ఓ బాలిక (16)పై అదే గ్రామానికి చెందిన గొల్ల జంపల విష్ణు అత్యాచారానికి యత్నించినట్లు గురువారం కేసు నమోదైంది. ఈనెల 22వ తేదీన బాలిక పొలంలో పనులు చేసుకుంటుండగా.. అక్కడికి చేరుకున్న విష్ణు బాలికను అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో అక్కడి నుంచి పరిగెత్తిన బాలిక ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement