ఉపకారానికి రేషన్‌కార్డు లింకు తొలగింపు | Sakshi
Sakshi News home page

ఉపకారానికి రేషన్‌కార్డు లింకు తొలగింపు

Published Fri, Nov 4 2016 6:56 PM

ration card link removed for scholarships

కర్నూలు(అర్బన్‌):  ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రేషన్‌కార్డు నిబంధనను తొలగించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేషన్‌కార్డు లేని విద్యార్థులు ఆధార్‌కార్డు అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుందని, రేషన్‌కార్డు అనే ఆప్షన్‌ దగ్గర నో అని క్లిక్‌ చేయాలన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు చెప్పారు.
 

Advertisement
Advertisement