రూటు మారుస్తున్న తమిళ కూలీలు | Sakshi
Sakshi News home page

రూటు మారుస్తున్న తమిళ కూలీలు

Published Sun, Jul 24 2016 9:49 AM

శేషాచలం అడవుల్లో స్వాధీనం చేసుకున్న దుంగల వద్ద డీఐజీ కాంతారావు (ఫైల్‌)

అంతుపట్టని స్మగ్లర్ల ఎత్తుగడలు 
ఛేదిస్తావుంటున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు
 
భాకరాపేట: ఎర్రచందనం అక్రవు రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నా తమిళ కూలీలు, స్మగ్లర్లు వ్యూహాత్మకంగా రూట్లు వూరుస్తూ అడవిలోకి వెళుతున్నారు. వారికి ఇంటి దొంగలు ఉప్పుందిస్తున్నారా అన్న అనువూనాలు వ్యక్తం అవుతున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లే కూలీల జాడ కనుగొనేందుకు అక్కడక్కడా సీసీ కెమెరాలు అవుర్చినా ప్రయోజనం లేదు. కూలీలు వాటి కంట పడకుండా వురో వూర్గంలో వెళుతున్నట్టు అధికారులు గుర్తించారు.
 
బృందాలుగా విడిపోయి..
తమిళ కూలీలు రైలు, బస్సుల ద్వారా చిత్తూరు వస్తున్నారు. అక్కడ బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల ద్వారా ఆటోలు, చిన్న చిన్న వాహనాలను ఎంచుకుని అటవీ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు వుండలాల్లోని అటవీ సరిహద్దులు ఆనుకుని ఉన్న గ్రావు పొలాల గుండా నడుచుకుని అడవిలోకి వెళుతున్నట్టు సమాచారం. అలాగే కడప జిల్లా నుంచి పోరువూమిళ్ల రహదారితోపాటు రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బాలపల్లె రేంజిలోకి వస్తున్నారు. శ్రీకాళహస్తి గొల్లపల్లె రహదారి గుండా అడవుల్లోకి ప్రవేశిస్తున్నారు. 

పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక చర్యలు
అడవిలోకి వెళ్లే కూలీలను అడ్డుకునేందుకు టాస్స్‌ఫోర్స్, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రకూలీలపై మరింత నిఘా పెంచారు. వీరికి పదేపదే సహకరిస్తున్న వారిపై డేగ కన్ను వేశారు. అదేవిధంగా కొత్తచట్టాలను సైతం తీసుకువస్తున్నారు. ఇంత చేస్తున్నా తమిళ కూలీలు యథేచ్ఛగా అడవిలోకి వెళ్లి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. వారు అడవిలో నుంచి బయటికి రావడానికి దారి చూపిస్తున్నదెవరన్నది నేటికీ మిస్టరీగానే ఉంది. ఇందులో ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా అనే దానిపై అధికారులు నిఘా పెట్టినట్టు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement