ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Mon, Nov 14 2016 11:19 PM

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్‌ పరిధిలోని ఊట్ల ప్రాంతం  గరుడాద్రి రస్తాలో  అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకునా​‍్నరు.  వీటిని తరలిస్తున్న ఐదుగురిలో నలుగురు పరారుకాగా ఒకరు పట్టుబడ్డారు. ఈ వివరాలను రేంజర్‌ రామ్‌సింగ్‌ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. గరుడాద్రి కొండల్లోని ఎర్రచందనం వృక్షాలను నరికి దుంగలుగా మలిచి భుజం మోతగా తరలిస్తుండగా   దాడులు చేశామనా​‍్నరు.  బాచిపల్లె తండాకు చెందిన బుక్కె సేవా నాయక్, తిరుపాల్‌ నాయక్, ఆహోబిలానికి చెందిన మేకల సంజీవ, దుబ్బన్న, కొండంపల్లెకు చెందిన చింతల చిన్న సుబ్బరాయుడు(బుజ్జి) అనే కూలీలు  అటవీ సిబ్బందిని గమనించి దుంగలను పారవేసి పరారు అయ్యారు. వెంబండించగా   బుక్కె సేవా నాయక్‌ పట్టుబడగా మిగిలిన నలుగురు చిక్కలేదని రేంజర్‌ తెలిపారు.   దాడుల్లో సెక‌్షన్‌ అధికారి మక్తర్‌ బాషా,  బీటు అధికారులు రమణ, ఉస్సేన్‌ బాష, బేష్‌ క్యాంప్‌ ప్రొటెక‌్షన్‌ వాచర్లు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement