భూగర్భ గనుల్లో నష్టాన్ని తగ్గించాలి | Sakshi
Sakshi News home page

భూగర్భ గనుల్లో నష్టాన్ని తగ్గించాలి

Published Sat, Sep 24 2016 12:27 AM

మాట్లాడుతున్న జీఎం ఉమామహేశ్వరరావు

  •  జీఎం ఉమామహేశ్వరరావు
  • కొత్తగూడెం:  భూగర్భ గనుల్లో వస్తున్న నష్టాన్ని తగ్గించేందుకు యంత్రాల పనిగంటలు మరింత పెంచుకోవాలని జీఎం పి.ఉమామహేశ్వరరావు సూచించారు.  శుక్రవారం మెయిన్‌ వర్క్‌షాప్‌లో జరిగిన మల్టీ డిపార్ట్‌మెంట్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓపెన్‌కాస్టులలో షావెల్స్‌ సామర్థ్య వినియోగం సగటు 74 శాతం మాత్రమే ఉందని, దీనిని 100శాతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సివిల్‌ డిపార్ట్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్, సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లలో నిర్వహించిన మల్టీ డిపార్ట్‌మెంట్‌ సమావేశాల్లో కమిటీ మెంబర్లు జీఎం (ఓసీపీ) ఎన్‌.నాగేశ్వరరావు, జీఎం (పర్సనల్‌) ఎ.ఆనందరావు, జీఎం (ఈఅండ్‌ఎం) నిర్మల్‌ కుమార్, జీఎం (ట్రాన్స్‌పోర్ట్‌) ఎస్‌.శంకర్, ఏజీఎం (ఎఫ్‌అండ్‌ఏ) నర్సింహమూర్తి, సీఎంఓఏఐ ప్రతినిధి పి.రాజీవ్‌ కుమార్, టీబీజీకేఎస్‌ నాయకులు ఎ.రవీందర్, ఐఎన్‌టీయూసీ నాయకులు వలస కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement