రెగ్యులర్‌ వార్డెన్‌ను నియమిస్తాం | Sakshi
Sakshi News home page

రెగ్యులర్‌ వార్డెన్‌ను నియమిస్తాం

Published Mon, Jul 25 2016 10:07 PM

REGULAR WARDEN

చింతూరు : స్థానిక ఎస్సీ వసతిగృహానికి త్వరలోనే రెగ్యులర్‌ వార్డెన్‌ను నియమిస్తామని ఏఎస్‌డబ్లు్యఓ డేవిడ్‌రాజు తెలిపారు. విద్యార్థులు హాస్టల్‌ను వీడుతున్న వైనంపై పత్రికల్లో కథనాలు రావడంతో ఆయన సోమవారం హాస్టల్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతూరు హాస్టల్‌ వార్డెన్‌ సెలవుపై వెళ్లడంతో గౌరిదేవిపేట హాస్టల్‌ వార్డెన్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. జ్వరాలు వచ్చిన విద్యార్థులను సిబ్బంది ఆస్పత్రులకు తీసుకువెళ్లి వైద్యం అందిస్తున్నారని, విలీన మండలాల్లోని మూడు హాస్టళ్లకు ఒక్కరే వార్డెన్‌ వుండడంతో కొంత ఇబ్బంది కలుగుతోందన్నారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో పాటు విద్యార్థులను విచారించారు. కాగా తరచూ హాస్టల్‌ నుంచి గైర్హాజరవుతున్న విద్యార్థులే టీసీలు తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారని ఇన్‌చార్జి వార్డెన్‌ కుమార్‌ తెలిపారు. దీనిపై వారిని పలుమార్లు హెచ్చరించినా వారి వైఖరిలో మార్పు రాలేదని, తాను లేని సమయంలో ఉన్నత పాఠశాలలో టీసీలు తీసుకుని వెళ్లిపోయారని ఆయన తెలిపారు. మరోవైపు హాస్టల్‌ నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోకుండా చూడాలని చింతూరు సర్పంచ్‌ సోడె శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ నాయకులు ఎండీ హబీబ్, అహ్మద్‌అలీలు ఏఎస్‌డబ్లు్యఓకు విజ్ఞప్తి చేశారు.
 

 

Advertisement
Advertisement