వైఎస్సార్‌ సీపీ నియామకాలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నియామకాలు

Published Thu, Aug 4 2016 10:22 PM

requrtemt in ysrcp

మంకమ్మతోట : వైఎస్సార్‌ సీపీ జిల్లా, మండల శాఖల్లో పలు నియామకాలు చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్‌ గురువారం తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆమోదంతో రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆదేశాలతో నియామకాలు చేపట్టినట్లు వివరించారు. ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బందెల వినోద్‌కుమార్‌ను నియమించారు. వెల్గటూర్‌ మండల అధ్యక్షుడిగా ఏలేటి లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా సాయిని తిరుపతి, తిరుమల్‌ ప్రమోద్, కరీంనగర్‌ మండల అధ్యక్షుడిగా వేల్పుల కిషన్, ధర్మపురి మండల అధ్యక్షుడిగా దాసరి విజయ్‌కుమార్, ఎలిగేడు అధ్యక్షుడిగా రాచమడుగు శ్రీనివాస్‌రావు, సుల్తానాబాద్‌ అధ్యక్షుడిగా పాలకుర్తి రమేష్‌గౌడ్, జూలపల్లి మండల అధ్యక్షుడిగా పనుగట్ల శేఖర్‌గౌడ్‌ నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement