గారకుంటతండాలో తీజ్‌ పండుగ | Sakshi
Sakshi News home page

గారకుంటతండాలో తీజ్‌ పండుగ

Published Thu, Jul 21 2016 7:06 PM

గారకుంటతండాలో తీజ్‌ పండుగ - Sakshi

గారకుంటతండా (గరిడేపల్లి) : మండలంలోని గారకుంటతండాలో గురువారం తీజ్‌ పండుగను గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ గుగులోతు మోతీ మాట్లాడుతూ గిరిజనులు సంప్రదాయబద్ధంగా ప్రతిఏటా జరుపుకునే పండుగే తీజ్‌ అన్నారు. తీజ్‌ ఉత్సవాలను జరుపుకునేందుకు ప్రభుత్వం గిరిజన తండాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుజాత, సక్రు లకుపతి, సురభి వెంకన్న, దశరథ నాయక్, పూల్‌సింగ్, డేంజర్, భవాని, మంగి పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement