అంతర్రాష్ట్ర మోసగాడు అరెస్టు | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర మోసగాడు అరెస్టు

Published Tue, Oct 4 2016 11:31 PM

criminal

ఒంగోలు క్రైం : అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని ఒంగోలు టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేసి ద్విచక్ర వాహ నం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ మేరకు టూటౌన్‌ సీఐ పి.దేవప్రభాకర్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం... వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ మేరకు ఒంగోలు సబ్‌ డివిజినల్‌ క్రైం పార్టీ పోలీసులు దర్యాప్తు చేపట్టి మంగళవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా జైలు సమీపంలోని ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీకి చెందిన గాజుల నాగేంద్రప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఇతను ప్రస్తుతం చిత్తూరు జిల్లా రేణిగుంటలోని కరకంబాడికాలనీలో నివాసం ఉంటూ వివిధ జిల్లాల్లో తిరుగుతూ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నాడు. అతని నుంచి ఒక టీవీఎస్‌ ఎక్సెల్‌ మోపెడ్‌తో పాటు రూ.48 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ కేసులు...
 
ఒంగోలు టూటౌన్‌ పోలీస్‌స్టేçÙన్‌లో జూలై 2016లో నమోదైన చీటింగ్‌ కేసులో నాగేంద్రప్రసాద్‌ నిందితునిగా ఉన్నాడు. గతంలో నాగార్జునసాగర్, హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేçÙన్ల పరిధిలో మోసాలకు పాల్పడ్డాడు. రిజర్వు ఇన్‌స్పెక్టర్‌నని నమ్మించి హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు  రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడు. 2013 జూన్‌ 25న సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంటకు మకాం మార్చాడు. అక్కడ రిజర్వు ఎస్సైనని చెప్పుకుంటూ రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమందిని మోసం చేశాడు. ఒంగోలుకు చెందిన మట్టిగుంట జనార్దన్‌రావు, అతని సంబంధీకులకు రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశాడు. ఈ ఏడాది జూలైలో ఒంగోలు బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ వద్ద జంగం బ్రహ్మనాయుడి నుంచి డబ్బు తీసుకుని మోసం చేశాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతనిపై ఒంగోలు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే రెండు కేసులు నమోదై ఉన్నాయి. నిందితుడిని అరెస్టు చేసిన టూటౌన్‌ సీఐ దేవప్రభాకర్‌తో పాటు ఒంగోలు సబ్‌ డివిజినల్‌ క్రైం పార్టీ ఎస్సై కమలాకర్, హెడ్‌ కానిస్టేబుళ్లు టి.బాలవీరాంజనేయులు, వై.చంద్రశేఖర్, సుధాకర్, కానిస్టేబుళ్లు హరిబాబు, రాంబాబులను ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు అభినందించారు.
 

Advertisement
Advertisement