Sakshi News home page

రైజింగ్‌ ‘హ్యాండ్స్‌’

Published Tue, Aug 16 2016 1:28 AM

రైజింగ్‌ ‘హ్యాండ్స్‌’

  • హ్యాండ్‌బాల్‌లో మెరుస్తున్న జిల్లా క్రీడాకారులు
  • మెరుగైన శిక్షణతో ఆటలో ప్రతిభ
  • పతకాల పరంపరతో ప్రత్యేక గుర్తింపు
 
‘‘మందలో ఒకరిగా కాదు.. వందలో ఒకరిగా ఉండు..’’ అని స్వామి వివేకానందుడు చెప్పిన మాటలను వీరు ఒంట పట్టించుకున్నారు. శ్రమయేవ జయతే సూక్తితో ముందుకు సాగుతూ తాము ఎంచుకున్న క్రీడలో రాణిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. రేజింగ్‌ గేమ్‌గా విలసిల్లుతున్న హ్యాండ్‌బాల్‌ క్రీడలో మెరుపు విజయాలు సాధిస్తూ తమదైన ముద్ర వేసుకుంటున్న ఓరుగల్లు ఆణిముత్యాలపై ప్రత్యేక కథనం. – న్యూశాయంపేట
 
 
మారుమూల ప్రాంతాల్లో పుట్టినప్పటికీ వారు మొక్కవోని దీక్షతో సాధన చేస్తున్నారు. క్రీడలపై ఉన్న మక్కువతో వా రు నిత్యం కఠోరంగా శ్రమిస్తూ అందులో రాణిస్తున్నారు. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ క్రీడాకారుల నిలయమైన ఓరుగల్లులో సీనియర్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని పలువురు రాష్ట్ర, జాతీయస్థా యి పోటీల్లో రాణిస్తున్నారు. హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌ పర్యవేక్షణలో, శాయ్‌ కోచ్‌ దేవేం దర్, రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్లు ఐలయ్య, కిషన్, అనూప్‌కుమార్, రామ్మూర్తి, నిమ్మ మోహన్‌రావు శిక్షణలో, అంతర్జాతీయ క్రీడాకారులు రవి, జగన్, మెహన్, ప్రవీణ్, అశోక్‌ సలహాలతో జిల్లా లో వందలకొద్ది రాష్ట్ర, జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ క్రీడాకారు లు వెలుగులోకి వచ్చారు. హ్యాండ్‌బాల్‌ క్రీడా గ్రామాలుగా వడ్డెపల్లి, పైడిపల్లి వెలుగొందుతున్నాయి. రాష్ట్రస్థాయి సీనియర్, జూనియర్, సబ్‌జూనియర్‌  హ్యాండ్‌బాల్‌ పోటీలు ఎక్కడ జరి గిన జిల్లాజట్లు విజయకేతనం ఎగురవేస్తున్నాయి. అలాగే హ న్మకొండలోని హ్యాండ్‌బాల్‌ అకాడమీలో పలువురు క్రీడాకారు లు జాతీయస్థాయిలో రాణిస్తూ జిల్లా కీర్తిని చాటుతున్నారు.
 
క్రీడా నేపథ్యం
 
19వ సెంచరీలో నార్తెర్న్‌ యూరప్, జర్మనీ హ్యాండ్‌బాల్‌ ఆట ప్రారంభమైంది. నూతన రూల్స్‌తో 1917లో జర్మనీలో మొదటి ఇంటర్నేషనల్, 1925లో పురుషుల, 1930లో మహిళల అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీలు నిర్వహించారు. తర్వాత ఈస్ట్‌నార్త్‌ ఆఫ్రికా, సాత్‌ ఆఫ్రికాల్లో విస్తరించింది. 1972లో  సమ్మర్‌ ఒలింపిక్స్‌ మచిబస్‌ ఇండోర్‌ స్టేడియాల్లో ఆడారు. 1946లో ఇంటర్నేషనల్‌ హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ ఫోరం ఏర్పాటైంది. భారతదేశంలో మొదట 1972లో సీనియర్‌ పురుషుల జాతీయస్థాయి చాంపియన్‌షిప్‌ పోటీలు హర్యానాలోని రోహతక్‌లో జరి గాయి. హర్యానాకు చెందిన జగత్‌సింగ్‌ లో హన్‌ను హ్యాండ్‌బాల్‌ ఫాదర్‌గా పిలుస్తారు.
 
డిఫెన్స్‌లో దిట్ట సుధీర్‌
 
నగరంలోని గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన సుధీర్‌ హ్యాండ్‌బాల్‌ క్రీడలో రాణిస్తూ  పతకాలు సాధిస్తున్నాడు.  సుధీర్‌. 10వ తరగతిలో  కెరీర్‌ ప్రారంభించి ఇప్పటి వరకు జాతీయ,రాష్ట్ర పోటీల్లో పాల్గొన్నా డు. 2011–12 మధ్యప్రదేశ్‌లో జరి గిన  సబ్‌ జూనియ ర్స్‌ నేషనల్స్, 2012–13లో పంజాబ్‌ లుథియానాలో జరిగిన అండర్‌–19 స్కూల్‌గేమ్స్, 2014–15లో కర్ణాటక మంగుళూర్‌లో జరిగిన సౌత్‌జోన్‌ సీనియర్‌ నేషనల్స్, 2015–16 తమిళనాడులో జూనియర్‌ నేషనల్‌ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. వీటితో పాటు సౌత్‌ ఇంటర్‌ యూనివర్సిటీ, సీనియర్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో పోటీల్లో ప్రతిభ కనబరిచాడు.
 
బాల్‌æపడితే...గోలే
 
ఏటూరునాగారానికి చెందిన పి.కుమార్‌స్వామి హ్యాండ్‌బాల్‌లో  ప్రతిభను కనబరిచాడు.  వరంగల్‌ హ్యాండ్‌బాల్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆయన ఇప్ప టి వరకు పలు  పతకాలు సాధిం చాడు  2011లో ఢిల్లీ జరి గిన అండర్‌–14 నేషనల్స్‌లో, 2013 లో మధ్యప్రదేశ్‌లో జూనియర్‌ బాలుర నేషనల్స్, అండర్‌–19 డిల్లీ జరిగిన సౌత్‌జోన్‌ పోటీల్లో ప్రతిభ చాటి స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. అలాగే 2016లో ఇంటర్‌ యూనివర్సిటీ పోటీల్లో కేయూ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కుమార్‌  బంగారు పతకం కైవసం చేసుకున్నాడు, విశాఖపట్నం, కర్నూల్, రంగారెడ్డిజిల్లాల్లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్‌ పోటీల్లో  పతకాలు  సాధించాడు. 
 
ఆనంద్‌ అదుర్స్‌
 
 ఏటూరునాగారానికి చెందిన ఆనంద్‌ జాతీయస్థాయి హ్యాండ్‌పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పలువరి మన్ననలు పొందుతున్నాడు. గ్రామీణ నేపథ్యం ఉన్నా తమ ప్రతిభకు కొదవలేదంటూ పలు పోటీల్లో ప్రతిభ కనబరుస్తు జిల్లా పేరు ప్రతిష్టలు నలుదిక్కుల చాటుతున్నాడు. కేడీసీ డిగ్రీ చదువుతున్న ఆనంద్‌ వరంగల్‌ హ్యాండ్‌బాల్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. 6వ తరగతిలోనే హ్యాండ్‌బాల్‌లో కెరీర్‌ను ప్రారంభించి తన హవా కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించాడు. 2010లో మధ్యప్రదేశ్‌ సబ్‌జూనియర్స్, 2011లో అండర్‌–14, 2012లో సబ్‌ జూనియర్స్‌లో, 2013లో అండర్‌–19 జూనియర్‌ నేషనల్స్‌లో పాల్గొని చక్కని ప్రతిభను చాటాడు. హర్యానాలో అండర్‌–17 జూనియర్స్‌లో, తమిళనాడులో ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. అలాగే రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, ఏలూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్స్, సీనియర్స్‌ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు.  

 

Advertisement

What’s your opinion

Advertisement