బ్యాంకుల వద్ద చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు

20 Jul, 2016 21:33 IST|Sakshi
హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ :
బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్లే వ్యక్తులను నమ్మించి వారి వద్ద ఉన్న డబ్బులు అపహరించే ముఠా సభ్యులు నలుగురిని హనుమాన్‌జంక్షన్‌lపోలీసులు బుధవారం అరెస్టుచేశారు. ఎస్‌ఐ తులసీధర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపులపాడు మండలం కోడూరుపాడుకు చెందిన ఇరదల వెంకటరత్నం గత నెల 17న విజయవాడ రోడ్డులోని కేడీసీసీ బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వెళుతుండగా ఎదురుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి ‘బైక్‌ పడిపోతుంది.. పట్టుకోండి’ అని కోరాడు. అతను బైక్‌ను పట్టుకుంటుండగానే ఆయన జేబులోని రూ. 50 వేలను అపహరించి పరారయ్యాడు. ఈ ఘటనపై నమోదైన కేసును ఎస్‌ఐ తులసీధర్‌ దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన నక్కా రాజేష్, నక్కా రాజు, ఆకివీడుకు చెందిన మేకల ఏసు, నక్కా విగ్నేష్‌లు ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. చిన్న వయస్సులోనే వ్యసనాలు, ఈజీ మనీకి అలవాటు పడిన ఈ యువకులు బైక్‌పై వెళుతూ బ్యాంకుల వద్ద చోరీలకు పాల్పడుతుంటారు. వీరిపై బంటుమిల్లి పోలీస్‌స్టేçÙన్‌లోనూ కేసు ఉంది.  
 
 
మరిన్ని వార్తలు