Sakshi News home page

తణుకులో భారీ చోరీ

Published Sat, Apr 22 2017 12:47 AM

తణుకులో భారీ చోరీ - Sakshi

తణుకు: తణుకులోని ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొం గలు అరవై రెండున్నర కాసుల బంగారు ఆభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులు అపహరించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సజ్జాపురంలోని హరిశ్చంద్ర టవర్స్‌ ఫేజ్‌–2లోని 405 ఫ్లాట్‌లో చిరుకూరి సుధ కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా ఈనెల 17న కుటుంబ సభ్యులంతా పుట్టపర్తి వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు చొరబడ్డారు. గురువారం రాత్రి 11 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అపార్టుమెంటులోకి చొరబడి ఫ్లాట్‌ తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలోని అరవై రెండున్నర కాసుల బంగారు ఆభరణాలతోపాటు నాలుగు కిలోల వెండి వస్తువులు దోచుకుపోయారు. ఇంటి ప్రధాన గుమ్మం గొళ్లెం విరగ్గొట్టిన దుండగులు చాకచక్యంగా లోనికి ప్రవేశించి ఇనుప బీరువాను మంచంపై పడుకోబెట్టి మరీ పగులగొట్టారు. ముందుగానే రెక్కీ నిర్వహించుకుని చోరీకి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. 
 
అదను చూసి దోచేశారు
కుటుంబ యజమానికి బ్యాంకు లాకర్‌ ఉండటంతో కొన్ని బంగారు ఆభరణాలు బ్యాంకులో దాచుకున్నారు. మిగిలిన ఆభరణాల కోసం మరో లాకర్‌ అడగటంతో సోమవారం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఆభరణాలను ఇంట్లో ఉంచి పుట్టపర్తి వెళ్లడం దొంగలకు అదనుగా మారింది. సంఘటనా స్థలాన్ని సీఐ చింతా రాంబాబు, పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు పరిశీలించి బా«ధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీంతో పాటు డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలించి ఆధారాలు సేకరించారు.  
 
వాచ్‌మెన్‌ ఉన్నా..
సజ్జాపురంలోని హరిశ్చంద్ర టవర్స్‌లోకి ప్రవేశించా లంటే ముందు ఉన్న హరిశ్చంద్ర టవర్స్‌ ఫేజ్‌–1 పక్క నుంచి వెళ్లాలి. అపార్టుమెంట్‌కు వాచ్‌మెన్‌ ఉన్నా దుండగులు చాకచక్యంగా మెట్లదారి గుండా ప్రవేశించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఇదే అపార్టుమెంట్‌లో పట్టణ పోలీసులు సమావేశం ఏర్పాటు చేసి చోరీలపై అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించినా కెమెరాలు లేవు. 
 
ఇంట్లో అంతా నిద్రిస్తుండగా..
కొవ్వూరు: కొవ్వూరు మండలంలోని ఆరికిరేవులలో మల్లిపూడి పెరుమళ్లరావు అనే వ్యక్తి ఇంట్లో గురువా రం రాత్రి దొంగలు పడ్డారు. రెండు కాసుల బంగారు ఉంగరాలు, 15 తులాల వెండి సామగ్రి దోచుకుపోయారు. వివరాలిలా ఉన్నాయి.. పెరుమళ్లరావు తన చిన్నాన్నతో కలిసి రాత్రి కొవ్వూరు సినిమాకి వెళ్లారు. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. సినిమా చూసి రాత్రి 12.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయం నిద్రలేచి చూ సేసరికి బీరువా తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. బీరువాలోని రెండు బంగారు ఉంగరాలు, 15 తులాల వెండి సామగ్రి కనిపించడం లేదని పెరుమళ్లరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై డి.గంగాభవాని తెలిపారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement