భువనగిరి ఖిలాపై రాక్‌క్లైంబింగ్‌

20 Sep, 2016 20:34 IST|Sakshi
భువనగిరి ఖిలాపై రాక్‌క్లైంబింగ్‌
భువనగిరి: సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మంగళవారం భువనగిరి ఖిలాపై రాక్‌కైంబింగ్‌ శిక్షణ ఇచ్చారు. కోచ్‌ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులు శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అధికారి ఎం.రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పాఠశాలకు ఇద్దరి చొప్పున ఎంపిక చేసినట్లు తెలిపారు. 23వ తేదీ వరకు ఖిలాపై విద్యార్థులు బేసిక్‌ ఫిట్‌నెస్‌ లెవల్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం మెరుగైన గ్రేడ్‌ సాధించిన వారిని పర్వతారోహణకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్‌ వీర్యానాయక్‌ ఉన్నారు.
 
మరిన్ని వార్తలు