ఆ బొమ్మలకు రూ.1.75 కోట్ల నిధులు! | Sakshi
Sakshi News home page

ఆ బొమ్మలకు రూ.1.75 కోట్ల నిధులు!

Published Tue, Mar 29 2016 10:12 PM

Rs 1.75 crore funds to release for Kondapally dolls

సాక్షి, విజయవాడ: కొండపల్లి బొమ్మలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు కేంద్రప్రభుత్వం రూ. 1.75 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర చిన్న, మధ్యతరగతి పరిశ్రమల శాఖ నేతృత్వంలో నడిచే స్ఫూర్తి(ఎస్‌ఎఫ్‌యూఆర్‌టీఐ) పథకం కింద ఈ నిధులు మంజూరయ్యాయని వివరించారు. కొండపల్లి ఉడ్‌క్రాఫ్ట్ క్లస్టర్‌కు ఈ నిధులు అందుతాయని ఇందులో చిన్న, మధ్యతరగతి పరిశ్రమల మంత్రిత్వశాఖ నుంచి రూ. 1.45 కోట్లు కేంద్ర గ్రాంటుగాను, రూ. 30 లక్షలు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ గ్రాంటుగాను వస్తాయని తెలిపారు.

కొండపల్లి బొమ్మల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు ఆధారంగా ఈ నిధులు విడుదల చేస్తున్నారని ఎంపీ తెలిపారు. సంప్రదాయ కళల్లో భాగంగా కొండపల్లి బొమ్మల తయారీ, అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి చేకూర్చడం, కొండపల్లి బొమ్మల క్లస్టర్‌పై ఆధారపడేవారి జీవన విధానాన్ని మెరుగుపరచడానికి, తరిగిపోతున్న సంప్రదాయ కళలకు జీవంపోయడానికి ఈ నిధులు వినియోగిస్తారని తెలిపారు.

Advertisement
Advertisement