Sakshi News home page

బైక్‌ కవర్‌లో ఉన్న రూ. 4.5 లక్షలూ..

Published Thu, Aug 18 2016 8:02 PM

పోలీసులకు వివరాలు వెల్లడిస్తున్న బాధితుడు

షాపులోకి వెళ్లి వచ్చేసరికి బైక్‌ కవర్‌లో..
ఉన్న సొమ్ము అపహరణ
 
గుంటూరు ఈస్ట్‌ : కాటన్‌ మిల్లులో పనిచేసే ఉద్యోగి ద్విచక్ర వాహనం బియ్యం షాపు ముందు ఆపి లోపలకు వెళ్లి వచ్చేటప్పటికి బైక్‌ పెట్రోల్‌ ట్యాంకుపై కవరులో ఉంచిన రూ.4.5 లక్షల నగదు అపహరణకు గురైన ఘటన నల్లచెరువులో కలకలం రేపింది. లాలాపేట ఎసై ్స మురళీకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుజ్జనగుండ్లకు చెందిన శ్రీనివాసరావు ఏటుకూరు బైపాస్‌లో ఓ కాటన్‌ మిల్లు నిర్వహిస్తున్నాడు. నల్లచెరువు 18వ లైనులో నివసించే కె.మురళీకృష్ణ ఐదేళ్లుగా శ్రీనివాసరావు వద్ద గుమస్తాగా పని చేస్తున్నాడు. రోజువారీ విధుల్లో భాగంగా గురువారం ఉదయం చందన బ్రదర్స్‌ సమీపంలోని కరూర్‌ వైశ్యా బ్యాంకు మెయిన్‌ బ్రాంచిలోకి వెళ్లి యజమానికి ఉన్న మరో సంస్థ అకౌంట్‌లోని రూ.4.5 లక్షలు డ్రా చేశాడు. ఆ నగదును చిన్న చేతి సంచిలో చుట్టి  తన ద్విచక్ర వాహనం పెట్రోల్‌ ట్యాంకు మీద ఉన్న కవర్‌లో ఉంచాడు. మిల్లుకు వెళ్తూ నల్ల చెరువు 9వ లైను మెయిన్‌ రోడ్డు మీదకు రాగానే బియ్యం షాపు ముందు ద్విచక్ర వాహనం నిలిపి లోకి వెళ్లాడు . కొద్దిసేపటికి బయటకు వచ్చి చూడగా కవర్‌లోని డబ్బులు కనిపించలేదు. కంగుతిని చుట్టు పక్కల పరిశీలించి లాలాపేట పోలీసులను ఆశ్రయించాడు. ఎసై ్స మురళీకృష్ణ ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. షాపులోని సీసీ కెమెరాను పరిశీలించగా ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మీద మురళీకృష్ణను అనుసరిస్తూ వచ్చినట్లు స్పష్టంగా రికారై ్డంది. కొన్ని అడుగుల దూరం ముందుకు వెళ్లి ఎవరన్నా గమనిస్తున్నారో లేదో పరిశీలించి ద్విచక్ర వాహనాన్ని మళ్లీ వెనక్కి తిప్పుకుని మురళీకృష్ణ బైక్‌ వద్దకు వచ్చి రెప్పపాటులో ట్యాంకు కవర్‌లోని నగదు తీసుకుని పరారైనట్లు స్పష్టంగా రికారై ్డంది. అయితే నిందితుడు బ్యాంకు నుంచి అనుసరించాడా లేక మిల్లు లావాదేవీలు ముందుగానే తెలుసుకుని పధకం ప్రకారం వచ్చాడా, అతను ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. 

Advertisement
Advertisement