ఇసుకేస్తే రూ. కోట్లు | Sakshi
Sakshi News home page

ఇసుకేస్తే రూ. కోట్లు

Published Sun, Sep 4 2016 5:18 PM

ఇసుకేస్తే రూ. కోట్లు - Sakshi

*  ప్రతి వాహనానికి 15శాతం వాటా
ఆ మూడుశాఖల మామూళ్లు రోజుకు రూ.లక్షల్లో
ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లకూ ఎక్కువే
ఎక్సకవేటర్లు, టిప్పర్లు, లారీలన్నీ సొంతమే
ఇసుక అక్రమరవాణాకు కొమ్ముకాస్తున్న వైనం 
 
సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు రూరల్‌: కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న నదీ తీరంలో అక్రమంగా 250కుపైగా ఇసుక రీచ్‌లున్న విష యం తెలిసిందే. ఇసుక దోపిడీలో అధికారపార్టీ ఎమ్మె ల్యే, నియోజక వర్గ ఇన్‌చార్జ్, స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లతోపాటు మరి కొందరు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదికిపైగా సాగుతున్న ఇసుక దోపిడీకి కొందరు అధికారుల పూర్తి సహకారం ఉందని ఇప్పటికే తేటతెల్లమైంది. అందులో రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌శాఖ అధికారులు కొందరున్నట్లు సమాచారం. 
 
నీకింత.. నాకింత
ప్రతి లారీ ఇసుక నింపుకుని వెళ్లాలంటే ముందుగా అక్కడ ఉన్న దళారికి రూ.500 చెల్లించాలి. ఇందులో నుంచి అధికారుల వాటా రూ.75. ఇలా ఒక్క రీచ్‌ నుంచి వెయ్యిలారీల ద్వారా రోజుకు రూ.75వేలు ముడతాయి. ఇలా 250 రీచ్‌ల ద్వారా లెక్కగడితే ఒక్కొక్కరికి రూ.లక్షల్లో మామూళ్లు అందుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇలా ఆ మూడు శాఖల్లోని గ్రామస్థాయి నుంచి మండలస్థాయి అధికారి వరకు మామూళ్లు అందుతున్నట్లు ఇసుక రీచ్‌లో పనిచేస్తున్న వారు చర్చించుకుంటున్నారు. నియోజక వర్గం, జిల్లా స్థాయి అధికారులకు మాత్రం అప్పుడప్పుడు విలువైన బహుమతులు, విందు, పొందు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
 
అగ్రతాంబూలం పాలకులకే..
ఇçÜుక రీచ్‌ల నుంచి వెళ్లే ప్రతి లారీ నుంచి ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, మండలపార్టీ అధ్యక్షులకు అక్రమ వసూళ్లలో నిర్ణీత మొత్తం పర్సంటేజీగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. రీచ్‌లో లారీకి రూ.500, డంపింగ్‌ చేసిన దళారీ నుంచి మరి కొంత, ఇతర ప్రాంతాలకు చేరవేశాక అక్కడ విక్రయాల్లో నుంచి ఇంకొంత ఇలా మూడు దశల్లో వీరికి మామూళ్లు ముడుతున్నాయి. పాలకులు తమ స్థాయిని బట్టి పర్సం టేజ్‌లు పుచ్చుకుంటున్నట్లు ఓ లారీ డ్రైవర్‌ వెల్లడించారు. ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్‌్జకి రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ముడుతున్నట్లు అంచనా. 
 
ఎక్స్‌కవేటర్లు, వాహనాలన్నీ సొంతమే.. 
ఇçÜుక అక్రమ రవాణా ద్వారా సంపాదించిన అక్రమార్జనతో అధికారపార్టీ నాయకులు పొక్లెయిన్లు, టిప్పర్లు, లారీలు, జేసీబీలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఒక్కొక్కరి వద్ద కనీసం 20వాహనాలకు తక్కువ లేవని డ్రైవర్లు వెల్లడించారు. వాహనాలను పర్యవేక్షించేవారికి రోజుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు ఉంటుంది. డ్రైవర్‌కు ట్రిప్పుకి రూ.700 చొప్పున చెల్లిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఒకరిద్దరు డ్రైవర్లు మాత్రమే 2, 3 ట్రిప్పులు తిప్పుతారని, ఎక్కువ మంది మాత్రం ఒక ట్రిప్పుకే సమయం సరిపోతుందని చెప్పుకొచ్చారు. ఇసుక అక్రమ రవాణాలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున జేబులు నింపుకుంటూ పర్యావరణానికి ముప్పు తెచ్చిపెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకోవాలి. 

Advertisement
Advertisement