ఆర్టీఏ సర్వీసులను పారదర్శకంగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ సర్వీసులను పారదర్శకంగా నిర్వహించాలి

Published Fri, Jul 29 2016 12:27 AM

శిక్షణలో మాట్లాడుతున్న ఆర్టీఓ కిష్టయ్య

– మీసేవా, ఈసేవా నిర్వాహకులకు శిక్షణ ఇచ్చిన ఆర్టీఓ కిష్టయ్య 
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన ఆర్టీఎ సేవలను పారదర్శకంగా నిర్వహించాలని రోడ్డు రవాణా శాఖ అధికారి కిష్టయ్య సూచించారు. గురువారం రెవెన్యూ సమావేశ మందిరంలో మీసేవా, ఈసేవా నిర్వాహకులకు ఆన్‌లైన్‌ ఆర్టీఎ సేవలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 59రకాల ఆర్టీఎ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఎలాంటి పొరపాట్లు లేకుండా స్లాట్‌ బుకింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిట్‌నెస్, ట్యాక్స్, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్‌ లైసెన్సు, లర్నింగ్‌ లైసెన్సు, పర్మిట్, కండక్టర్‌ లైసెన్సు, డీలర్‌ వంటి సేవలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని గద్వాల, మహబూబ్‌నగర్‌ డివిజన్‌లకు సంబందించిన మీసేవా, ఈసేవా నిర్వాహకులకు విడతలవారిగా శిక్షణ ఇచ్చారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ గులాంమహ్మద్, మీసేవా సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు, టెక్నికల్‌ అధికారి శ్రీనివాస్, ఈడీఎం చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement