ఆర్టీసీకి జిల్లాలో రోజుకు రూ.13 లక్షల నష్టం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి జిల్లాలో రోజుకు రూ.13 లక్షల నష్టం

Published Sun, Aug 21 2016 10:11 PM

Rtc income loss

  • గత ఏడాది అర్ధ సంవత్సరంతో పోలిస్తే రూ.8 కోట్ల నష్టం
  • అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్న ఆర్‌ఎం
  • రాజమహేంద్రవరం సిటీ : 
    జిల్లాలో గతేడాది మెుదటి అర్ధ సంవత్సరంలో లాభాల్లో నడిచిన ఆర్టీసీ ఈ ఏడాది నష్టాలో నడిచింది. 2015 మెుదటి అర్ధ సంవత్సరంలో రూ.3.5 లక్షల ఆదాయం సాధించిన ఆర్టీసీ 2016 మొదటి అర్ధ సంవత్సరంలో రూ.8 కోట్ల న ష్టాలు చవి చూసిందని సంస్థ రీజనల్‌ మేనేజర్‌ రవికుమార్‌ చెప్పారు. తన కార్యాలయంలో తననకు‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లాలో 880 గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర, సూపర్‌ డీలక్స్‌ డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులను వివిధ ప్రాంతాలకు మూడు లక్షల 52 వేల కిలోమీటర్ల దూరం నడుపుతున్నట్టు చెప్పారు. ఈ బస్సుల ద్వారా రోజుకు రూ.కోటి రావలసి ఉండగా రూ.87 లక్షలు మాత్రమే వస్తోందన్నారు. కిలోమీటరుకు రూ.32.74 ఖర్చు చేస్తుండగా ఆదాయం  రూ.25.68 మాత్రమే వస్తుండటంతో రోజుకు సుమారు రూ.13 లక్షల మేర నష్టం వాటిల్లుతోందన్నారు. అయితే నష్టాలను అధిగమించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చే శామన్నారు. పాడైన బస్సులకు రాత్రికి రాత్రే మరమ్మతులు చేసి, తిరిగి నడిపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆర్టీసీ పార్శిల్‌ కార్యాలయం ద్వారా నెలకు రూ.40 వేల ఆదాయం సమకూరుతోందన్నారు. 
     

Advertisement

తప్పక చదవండి

Advertisement