ఆర్‌టీఓ కార్యాలయానికి డీటీసీ హోదా | Sakshi
Sakshi News home page

ఆర్‌టీఓ కార్యాలయానికి డీటీసీ హోదా

Published Mon, Oct 3 2016 11:17 PM

rto upgrade as dtc

మహబూబ్‌నగర్‌ క్రై ం : రోడ్డు రవాణా అధికారి కార్యాలయం (ఆర్‌టీఓ) ఇక నుంచి డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ (డీటీసీ) గా మారనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జిల్లా డిప్యూటీ రవాణా కమిషనర్‌గా మమతాప్రసాద్‌ను నియమించారు. మహబూబ్‌నగర్‌కు ఏడాది క్రితమే జిల్లాకు డీటీసీ హోదా వచ్చింది. అయితే రెగ్యులర్‌ అధికారి రాకపోవడంతో పెండింగ్‌లో ఉంచారు. ప్రస్తుతం డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ నియామకంతో పాలమూరులో డీటీసీ స్థాయి సేవలు అందుబాటులోకి రానున్నాయి.
 
మరో రెండు రోజుల్లో ఆమె పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక నుంచి మహబూబ్‌నగర్‌తోపాటు నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలు డీటీసీ పర్యవేక్షణలో పని చేయనున్నాయి. ప్రస్తుతం మమతాప్రసాద్‌ హైదరాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ఆమెను జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement