రంగాపూర్‌లో రద్దీ | Sakshi
Sakshi News home page

రంగాపూర్‌లో రద్దీ

Published Sat, Aug 13 2016 7:15 PM

రంగాపూర్‌ఘాట్‌వద్ద జనసందోహం

రంగాపూర్‌ ఘాట్‌ : పుష్కరాల రెండోరోజు శనివారం శ్రీరంగాపూర్‌ ఘాట్‌లో భక్తుల రద్దీ పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు 50 వేల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్లు అంచనా వేశామని ఘాట్‌ ప్రత్యేకాధికారి దామోదర్‌రెడ్డి తెలిపారు. నది ప్రవాహం తగ్గటంతో భక్తులు ఎలాంటి ఇబ్బంది, భయం లేకుండా స్నానమాచరించారు. పార్కింగ్‌ స్థలాల్లో సుమారు ఎనిమిది వేల వాహనాలు వచ్చినట్లు అధికారులు ప్రాథమిక అంచనా. జిల్లాలో అతిపెద్ధ ఘాట్‌గా ఎంపిక చేయడంతో రాత్రి, ఆదివారం లక్షకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు.
 
 
సౌకర్యాలు బాగున్నాయి  
మొదటిసారి పుష్కర స్నానాలకు వచ్చాను. రంగాపూర్‌ఘాట్‌వద్ద భక్తుల కోసం ఏర్పాట్లు బాగానే చేశారు. కానీ నీళ్లు తగ్గడంతో మునకకు సాధ్యంకాలేదు. అంత దూరంనుంచి వచ్చి షవర్‌ స్నానం చేసి సర్దుకోవాల్సి వచ్చింది.
–  మద్దిలేటి, గిద్దలూరు, ప్రకాశంజిల్లా
 
 
ప్రశాంతంగా ఉంది 
ఇప్పటికే రెండుసార్లు పుష్కర స్నానం చేశాను. గోదావరి పుష్కరాలకు వెళ్తే నీరు తక్కువగా ఉన్నాయి. అక్కడి స్నానం సంతప్తి కలగలేదు. నిండా పారుతున్న కష్ణానదిలో సూర్యోదయంకాగానే స్నానం చేశాను. ప్రశాంతంగా ఉంది.
 – నర్సింగరావు, నవాబ్‌పేట, పాలమూరు
 
 
 
 

Advertisement
Advertisement